Jai Bhim: స్టార్ హీరో సూర్య(Suriya), డైరెక్టర్ జ్ఞానవేల్ (T. J. Gnanavel) కాంబోలో తెరకెక్కిన సినిమా 'జైభీమ్' (Jai Bhim). కే మ‌ణికందన్, లిజొమోల్ జోస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా.. రావు ర‌మేశ్‌, ర‌జిషా విజ‌య‌న్, ప్ర‌కాశ్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌-జ్యోతిక‌ నిర్మించారు. ప్రముఖ ఓటీటీ డిజిటల్ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ (Amazon prime) వీడియోలో విడుద‌లైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. లాయ‌ర్ రోల్‌లో హీరో సూర్య అదరగొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులను గెలుచుకుంది. నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో 3 అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అస్కార్ కు కూడా నామినేట్ అయింది ఈ చిత్రం. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్‌ కూడా అయింది. తాజాగా జైభీమ్ అరుదైన గౌరవం దక్కించుకుంది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (12th Dadasaheb Phalke International Film Festival) ఈ చిత్రం రెండు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. బాధితుడి పాత్ర‌లో జీవించిన మ‌ణికంద‌న్‌కు ఉత్త‌మ స‌హాయ న‌టుడు పురస్కారం దక్కింది.  



Also Read: Keerthy Suresh: మహేశ్ బాబును 3 సార్లు కొట్టాను... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook