Jailer Fame Vinayakan Mangalavaram Arrested: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్  హీరోగా నటించిన చిత్రం 'జైలర్' ఎంత పెద్ద హిట్ సాధించిందో మన అందరికి తెలిసిందే! అనిరుద్ అందించిన పాటలు బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోగా.. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరొచ్చింది. ముఖ్యంగా విలన్ వినాయకన్‌ను మంగళవారం  మంచి నటనతో ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్ రజనీ నటనను మ్యాచ్ చేస్తూ.. తనదైన శైలిలో కామెడీతో కూడిన విలనిజాన్ని పండించారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే విషయానికి వస్తే.. 'జైలర్' నటుడు వినాయకన్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. మద్యం మత్తులో పోలీసు స్టేషన్ వద్ద అల్లకల్లోలం సృష్టించినందుకు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిజానికి అతని అపార్ట్‌మెంట్‌లో తన భార్యతో వివాదంపై మాట్లాడటానికి పోలీసులు అతన్ని పిలిపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఎర్నాకులం నార్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గొడవ చేశారు. 
పోలీస్ స్టేషన్‌లో గొడవ చేసినందుకు గాను వినాయకన్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నటుడిని అవసరమైన వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు అతనిని బెయిల్‌పై విడుదల చేశారు.


Also Read: Telangana Elections: తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైనట్టేనా, జనసేన సీట్లేవి


కాగా.. వైద్య పరీక్షల అనంతరం ఆసుపత్రి నుంచి పోలీసులతో బయలుదేరిన వినాయకన్ మీడియా మాట్లాడుతూ.. "తనను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియడం లేదని అన్నారు" . అరెస్టుకు గల కారణం ఏంటని అడిగినపుడు నటుడు ఏమన్నాడంటే.. "నేను ఫిర్యాదు చేయడానికి వచ్చాను. నన్ను ఇక్కడికి (హాస్పిటల్) ఎందుకు తీసుకువచ్చారో దయచేసి పోలీసులను అడగండి" అని మీడియాతో పేర్కొన్నాడు. నటుడితో పాటు ఆసుపత్రికి వచ్చిన పోలీసు అధికారి విలేకరులతో మాట్లాడుతూ.. మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌లో గొడవ సృష్టించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు రోజు, తన భార్యతో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి నటుడు వినాయకన్ అపార్ట్‌మెంట్‌కు పోలీసులను పిలిచినట్లు అధికారి తెలిపారు. 


Also Read: Drop 4K Tv Price: బిగ్ దసరా సేల్‌లో సాంసంగ్‌ 4K Tv స్మార్ట్‌ టీవీని రూ.22,940కే పొందండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.