Jailer Movie title Controversy: సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సినిమా 'జైలర్'. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్ తమదేనంటూ ఓ దర్శకుడు కోర్టుకెక్కారు. వెంటనే టైటిల్ మార్చాలంటూ సన్ పిక్చర్ నిర్మాణ సంస్థను మలయాళ దర్శకుడు సక్కిర్ మడథిల్ డిమాండ్ చేశారు.  ఈ కేసు త్వరలోనే కోర్టు హియరింగ్ రాబోతున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటి లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం వల్ల అభిమానుల్లో కాస్త ఆందోళన మెుదలైంది. జైలర్ సినిమాలో రజినీకి జోడిగా తమన్నా నటించింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆగస్టు 10న రిలీజ్ కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మలయాళ డైరెక్టర్ సక్కిర్ మడథిల్ 2021 ఆగస్టులో కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో 'జైలర్' టైటిల్ రిజిస్టర్ చేశారు. అంతేకాకుండా అదే ఏడాది నవంబరు నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయి. అంతేకాకుండా గతేడాది జూలై 26న దుబాయ్ షార్జాలో జరిగిన ఓ ఈవెంట్ లో టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసినట్లు దర్శకుడు సక్కిర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్, ముంజు వారియర్ వంటి నటులు కూడా వచ్చారని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. 


Also Read: NTR Devara: ‘దేవర’పై అదిరిపోయే అప్‌డేట్‌.. యాక్షన్ సన్నివేశాలు కంప్లీట్..


రజినీ జైలర్ కేరళలో కూడా విడుదల కానుంది. అందువల్ల ఆ ఒక్క రాష్ట్రంలోనైనా వారి సినిమా టైటిల్ ను మార్చాలని దర్శకుడు సక్కిర్ సన్ పిక్చర్స్ సంస్థను కోరారట. అయితే దానికి వారు అంగీకరించలేదని సక్కిర్ తెలిపారు. అయితే రెండు సినిమా కథల నేపథ్యం వేరైనప్పటికీ.. టైటిల్ ఒక్కటే కావడ వల్ల ప్రేక్షకులు సందిగ్దతకు లోనవుతారని.. అది సినిమా కలెక్షన్ పై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. దీనిపై సన్ పిక్చర్స్ సంస్థ కూడా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 


Also read: Baby 2nd Day Collections: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' బీభత్సం.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook