Jala Jala Jalapaatham​ Video Song: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూనే విజయాన్ని అందుకున్నాడు మెగా మేనల్లుగు వైష్ణవ్ తేజ్.  మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు ఉప్పెన మూవీతో ఉప్పెనలా కలెక్షన్లు రాబట్టాడు. హీరోయిన్‌ కృతిశెట్టి టీనేజీ అమ్మాయి అయినప్పటికీ వయసుకు మించి పరిణతిని తన నటనలో చూపించి ప్రశంసలు అందుకుంది. ఆమెకు ప్రస్తుం వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఉప్పెన మూవీ (Uppena Movie) నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ మూవీలోని నీ కన్ను నీలి సముద్రం.. పాట సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాయడం తెలిసిందే. ఏడాది పాటు విడుదల వాయిదా పడిన అందుకు తగ్గ ప్రతిఫలం ఉప్పెన మూవీ నిర్మాతలు, దర్శకుడు అందుకున్నారు.


Also Read: Ram సినిమాకు సైన్ చేసిన Uppena హీరోయిన్ Krithi Shetty remuneration ఎంతో తెలుసా 


ప్రముఖ గేయ రచయిత శ్రీమణి సాహిత్యం సమకూర్చిన ఈ ‘జల జల జలపాతం నువ్వు..’ అనే పాటను శ్రేయా ఘోషల్, జస్ప్రిత్ జాస్జ్ అద్భుతంగం పాడారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. 10 గంటల వ్యవధిలో 3 మిలియన్లకు పైగా వీడియో సాంగ్ వీక్షించగా, ప్రస్తుతానికి 2 లక్షల మంది లైక్ చేశారు. ముఖ్యంగా యువత ఈ పాటను పదే పదే వింటూ మైమరచిపోతున్నారు.


Also Read: Uppena Movie In OTT: ఓటీటీ వేదికగా ఉప్పెన, భారీ ధర పలికిన Vaishnav Tej ఫస్ట్ మూవీ



కాగా, ఈ ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉప్పెన సినిమా అంచనాలు అంచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించడం సినిమాకు ప్లస్ అయింది. కొత్తవాళ్లయినప్పటికీ వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి(Kriti Shetty) తమ పాత్రలకు ప్రాణం పోసి విజయాన్ని అందుకున్నారు.


Also Read: LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీతో డెత్ బెనిఫిట్, Maturity Benefit 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook