Avatar The Way Of Water Trailer : అవతార్ సినిమా గురించి తెలియని సినీ ప్రేమికుడు, సినీ ప్రేక్షకుడూ ఉండడు. ప్రపంచ బాక్సాఫీస్‌ను గడగడ వణికించేసిన సినిమా అవతార్. అంతకు ముందు టైటానిక్ పేరు మీదున్న రికార్డులను బద్దలు కొట్టేశాడు. అవార్డుల పరంగా అయినా, కలెక్షన్ల పరంగా అయినా కూడా అవతార్ సినిమా అన్నింట్లోనూ ఎప్పటికీ చెరిగిపోని రికార్డులు క్రియేట్ చేసింది. మొదటి పార్ట్ వచ్చిన పదమూడేళ్ల తరువాత అవతార్ రెండో పార్ట్ రాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అవతార్ సినిమాను ఈ సారి అండర్ వాటర్‌లో తెరకెక్కించాడు జేమ్స్ కామెరాన్. అయితే ఈ మూవీ టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేయాలని అనుకున్నారు. నేటి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేయాలి. అయితే ఈ మూవీ ట్రైలర్ కోసం జనాలు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తూ ఉన్నారు. కానీ చెప్పిన టైం దాటిపోయింది. అయినా ట్రైలర్ రాలేదు. దీంతో జనాలకు ఆగ్రహం వచ్చింది.


 



ఇలా చెప్పిన టైంకు ట్రైలర్, టీజర్ విడుదల చేయలేకపోవడం మన వాళ్లకు అలవాటే. మా వాళ్లేలానే మీరు కూడా తయారయ్యారా? అంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఏయ్ బాబు లెవ్.. టైం అయింది అంటూ డీజే టిల్లు స్టైల్లో జేమ్స్ కామెరాన్ మీద కౌంటర్లు వేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తెలుగు ఫ్యాన్స్ అవతార్ ట్రైలర్ కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు.


 



మరి అవతార్ రెండో ట్రైలర్ వస్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయేలా ఉంది. వ్యూస్ పరంగా వరల్డ్ వైడ్ కొత్త రికార్డులను క్రియేట్ చేయడం మాత్రం ఖాయమని ఈ బజ్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎక్కువగా తెలుగు ఆడియెన్స్ ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ట్విట్టర్ చూస్తే తెలుస్తోంది.



Also Read : Baladitya Vs Geetu : ఆదిరెడ్డి చెబుతున్నా వినడం లేదు.. గీతూ మొండిపట్టు.. అల్లాడిపోయిన బాలాదిత్య


 


Also Read : Sohail Kathuria Biodata: అసలు ఎవరీ సోహాల్ కతూరియా.. హన్సికను ఎలా పడేశాడో తెలుసా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook