Janani song released from movie RRR movie: తెలుగు సినిమా ప్రఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన రాజమౌళి తెరకేక్కిస్తున్న సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్న విడుదలైన  నాటు నాటు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ రోజు జనని సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.. 


"సోల్ అంతెం ఆఫ్ RRR"గా విడుదలైన ఈ పాటలో చరణ్ ఎరుపు రంగు మిలట్రీ డ్రెస్ తో ఎంట్రీ అవ్వటం.. తరువాత గాయాలతో ఎన్టీఆర్ కనపడటం.. తరువాత బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ గాన్ పట్టుకొని.. పక్కన హీరోయిన్ శ్రియ "మరి మీరు అని అడగటం".. "సరోజినీ నేను అంటేనే నా పోరాటం అందులో నువ్ సగం" అని చెప్పిన అజయ్ దేవగన్.. బాలీవుడ్ నటి  అలియా భట్ మట్టి చేతులతో తీసుకొని.. రామ్ చరణ్ కి తిలకం దిద్దటం.. ఇలా ఆద్యంతం భావోద్వేగాలతో సాగింది. 




Also Read: Samantha: హాలీవుడ్‌‌లోకి సమంత ఎంట్రీ షురూ...అఫీషియల్ గా ప్రకటించిన సామ్..!


అప్పట్లో దేశ ప్రజలపై ఆంగ్లేయుల పాలనలో జరిగిన దురాగతాలకు ప్రజలలో కలిగిన భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ పాట కొనసాగటం.. స్వాతంత్య్ర పోరాటనికి అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలను ఉసి గొల్పిన సన్నివేశాలుగా అనిపిస్తున్నాయి.. 



'ఆర్‌ఆర్‌ఆర్‌'...చిత్రంలో రామ్ చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్ (NTR) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 (RRR release date)న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. ఆలియా భట్‌, శ్రియ, సముద్రఖని, ఒలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి మన అందరికి తేలింది. 


Also Read: Nara Bhuvaneswari: 'నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదు'..: నారా భువనేశ్వరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి