Pushpa2: ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా దేవర. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె తెలుగు సినిమాలలో కూడా హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దిరోజులుగా ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే..అల్లు అర్జున్ హీరోగా బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 కూడా త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది. 


తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పాట ప్రోమో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు జాన్వి కపూర్ కి తాను హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ దేవర సినిమా కంటే.. తనకి ఏమాత్రం సంబంధంలేని పుష్ప 2 సినిమా మీదే… తన దృష్టి మొత్తం ఉంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 


వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఫియర్ సాంగ్ గురించి చేసిన పోస్ట్ కి జాన్వీ కపూర్ లైక్ చేయలేదు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 పాట గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ కి లక్షలాది అభిమానులతో పాటు.. జాన్వి కపూర్ కూడా లైక్ చేసింది. తన సొంత సినిమా దేవరను పెద్దగా పట్టించుకోని జాన్వి పుష్ప 2 సినిమా పై మాత్రం ఎందుకు అంత ఆసక్తి చూపిస్తుంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 


తన సొంత సినిమా దేవర తనకి నచ్చడం లేదా, సినిమా ప్రమోషన్స్ లేదా సినిమా విషయంలోనే జాన్వి కపూర్ డిసప్పాయింట్ అయిందా.. అంటూ మరికొందరు కామెంట్లు మొదలుపెట్టారు. అయితే సోషల్ మీడియాలో ఒక చిన్న లైక్ కొట్టలేదు అన్న విషయాన్ని.. ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అని మరికొందరు తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. 


ఏదేమైనా ఈ విషయం మీద క్లారిటీ కేవలం జాన్వి కపూర్ మాత్రమే ఇవ్వగలదేమో. ఇక పుష్ప 2 సినిమా ఆగస్టు లో విడుదల కి సిద్ధం అవుతుండగా, దేవర సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నాయి.


Also Read: Mohanlal: క్రేజీ బ్లాక్ బస్టర్‌ సీక్వెల్‌లో జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్.. ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter