Janhvi Kapoor Fixed for NTR 30: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ ఈ సినిమా అధికారిక ప్రకటన మాత్రమే వెలువడింది. కానీ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటి వరకు ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు రచ్చ చేస్తూ ఉండేవారు. కానీ అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ క్లాస్ పీకడంతో ఇక ఈ టెన్షన్ తప్పినట్లే చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయం మీద క్లారిటీ లేదు. దీంతో రకరకాల పేర్లు తెరమీదకు వస్తూ ఉండేవి. రకరకాల పేర్లు ప్రచారం జరుగుతూ ఉండేవి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.


ఈ మేరకు ఒక వారం రోజుల క్రితం శంషాబాద్ లో ఏర్పాటు చేసిన సెట్లో జాన్వీ కపూర్ కి సంబంధించిన ఫోటోషూట్ జరిగిందని ఆ ఫోటోషూట్ లో ఆమె కరెక్ట్ గా సెట్ అవుతుందని దర్శకుడు కొరటాల శివ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


సినిమా కోసమే నిర్మించిన ప్రత్యేక సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుతారని అలాగే గోవాలో కూడా ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నారని తెలుస్తోంది. ఒక ప్రత్యేకమైన దీవి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఒక కల్పిత దీవి ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు. అందుకే గోవాలో కూడా చాలా వరకు షూటింగ్ జపపబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఎన్టీఆర్ ఆర్ట్స్, కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ కు చెందిన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ల మీద ఈ సినిమా సంయుక్తంగా తెరకెక్కబోతోంది.


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్


Also Read: Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook