Janhvi Kapoor About Jr NTR: NTR30 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ జంటగా నటించడం ద్వారా సౌతిండియా సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా టుడే కాన్‌క్లేవ్ షోలో తన సౌతిండియా డెబ్యూ గురించి జాన్వి కపూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తారక్ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం తాను ఎంతో బలంగా కోరుకున్నానని.. ఎన్నోసార్లు ఆ దేవుడిని ప్రార్థించాను అని చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది అని వ్యాఖ్యానించిన జాన్వి కపూర్.. తారక్ స్క్రీన్ ప్రజెన్స్‌ని ఎంజాయ్ చేయడం కోసం ఇటీవలే మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీ చూశాను అని వెల్లడించింది. 



 


తారక్‌తో కలిసి నటిస్తే.. అదే తన జీవితంలో ఒక గొప్ప మూమెంట్ లాంటిది అని చెప్పడం ద్వారా తారక్ పై తనకు ఎన్ని హోప్స్ ఉన్నాయో జాన్వి కపూర్ చెప్పకనే చెప్పింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాను అని గుర్తుచేసుకుంది. తాను ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తానని.. అందుకే తాను కోరుకుంది జరుగుతోంది అంటూ తారక్‌తో కలిసి నటించే ఛాన్స్ ని తనకు వచ్చిన గొప్ప అవకాశంగా అభివర్ణించింది.


ఇది కూడా చదవండి : No Free Tickets for Team RRR : ఆస్కార్ అవార్డ్స్ షో టికెట్స్ కోసం రూ. 1.44 కోట్లు ?


ఇది కూడా చదవండి : Allu Arjun Unblocked : ఇంతలోనే ఏం జరిగింది.. వెనక్కి తగ్గిన అల్లు అర్జున్.. భాను శ్రీ మెహతాకి విముక్తి


ఇది కూడా చదవండి : Tanish Look : చాలా రోజులకు ఇలా కనిపించిన తనీష్.. హీరో శ్రీరామ్‌ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK