Janhvi Kapoor Telugu Films: మరో రెండు తెలుగు సినిమాలలో జాన్వీ కపూర్.. ఫ్లాఫ్ హీరోకు జతగా!
Janhvi Kapoor Upcoming Movies List in Telugu. అఖిల్ అక్కినేని తాజాగా మూవీలో జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
Janhvi Kapoor to work with Akhil Akkineni and Ram Charan: అందాల తార శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ వెండి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో తక్కువ సినిమాల్లో నటించినా.. క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో జాన్వీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు బాలీవుడ్‌లో నటిస్తూనే.. సౌత్‌పై కూడా ఫోకస్ పెట్టారు. మరోవైపు 2018 బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను టాలీవుడ్‌లో పరిచయం చేయడానికి ప్రయత్నించారు. చివరకు దర్శకుడు కొరటాల శివ సక్సెస్ అయ్యాడు. 'NTR 30'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిస్తున్నారు.
'NTR 30' సెట్స్‌పై ఉండగానే జాన్వీ కపూర్‌కు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. అఖిల్ అక్కినేని తాజాగా మూవీలో జాన్వీని ఫైనల్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రానికి 'ధీర' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ ఫైనల్ అయ్యిందట. యూవీ క్రియేషన్స్ ఆమెను నేరుగా సంప్రదించినట్లు సమాచారం. అఖిల్‌కు వరుసగా ఫ్లాప్‌లు పడుతుండడంతో.. జాన్వీని తీసుకోవాలని అనుకుంటున్నారట. జాన్వీ వల్ల సినిమాకు హైప్ వస్తుందని అబిప్రాయపడుతున్నారట. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలోనూ హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. బుచ్చిబాబు కూడా జాన్వీ కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను రాశారని తెలుస్తోంది. ప్రస్తుతం దీని కోసం చర్చలు జరుగుతున్నాయి. జాన్వీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసే అవకాశం ఉంది. NTR30 రిలీజ్ అనంతరం బాలీవుడ్ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఈ రెండు సినిమాల కోసం నిర్మాతలు జాన్వీ కపూర్‌కు ఎంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనేది ఇంకా తెలియలేదు. బిజీ షెడ్యూల్ దృష్ట్యా జాన్వీ అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న 'NTR 30' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాలీవుడ్‌లో ఓ ఆసక్తికర థ్రిల్లర్ చిత్రంలో జాన్వీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఉలజ్ చిత్రంలో ఆమె నటించనున్నారట.
Also Read: Pawan Kalyan: నేను సీఎం రేసులో లేను.. కానీ నా సత్తా ఏంటో చూపిస్తా! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Also Read: Samantha-MS Dhoni: అయ్యా బాబోయ్.. ఎంఎస్ ధోనీ అంత కూల్‌గా ఎలా ఉంటాడో: సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.