Pushpa 2: బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంటూ క్రేజీ ఫాలోయింగ్ ఉన్న నటి జాన్వీ కపూర్. టాలీవుడ్ ఎంట్రీ కోసం జూనియర్ ఎన్టీఆర్ తో దేవర లాంటి సాలిడ్ పాన్ ఇండియన్ మూవీ ని ఎంచుకుంది ఈ బ్యూటీ. మరోపక్క రామ్ చరణ్ 16వ చిత్రంలో కూడా జాన్వీ కపూర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎంట్రీ ఇవ్వక ముందు క్రేజీ ఆఫర్లు పట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉన్న పుష్ప చిత్రం లో కూడా ఈ బాలీవుడ్ భామ కనిపించబోతోంది అని టాక్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసి సమంత అందరిని ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా ఉహూ అంటావా సాంగ్ ఈ మూవీకి హైలైట్ గా నిలిచింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన ఈ పాట ను మించి పుష్ప 2 చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ మరొకసారి కొత్త ఐటమ్ సాంగ్ కంపోజ్ చేసినట్టు టాక్. ఈ ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్ ను రంగంలోకి దించుతున్నారు అన్న వార్త ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతుంది. అయితే తెలుగులో తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఈ టైంలో జాహ్నవి ఇంత రిస్క్ చేస్తుందా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.


ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పుష్ప 1లో ఐటమ్ సాంగ్ చేసిన సమంత పరిస్థితి వేరు. అప్పటికే  సామ్ కు తెలుగులో మంచి స్టార్ స్టేటస్ తో పాటు అందరి హీరోలతో సినిమాలు చేసిన అనుభవం కూడా ఉంది. ఏదన్నా తేడా జరిగిన సమంత ఇమేజ్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే ఇక్కడ జాన్వీ పరిస్థితి అది కాదు. జాన్వీ ఇంకా తెలుగులో ఎంట్రీ ఇవ్వనే లేదు. దేవర మూవీ కంటే కూడా ముందుగా పుష్ప ఆగస్టు 15 కే విడుదలవుతుంది.


ఒకవేళ జాన్వి ఇందులో అందరూ అంటున్నట్టు ఐటమ్ సాంగ్ ఒప్పుకుంటే ఆ ఇంపాక్ట్ తన నెక్స్ట్ మూవీస్ పై ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఆమెకు తెలుగులో హీరోయిన్ గా కాకుండా ఒక ఐటమ్ సాంగ్ చేసే స్టార్ గా ఇంట్రడక్షన్ కార్డు పడుతుంది. అయితే దీనికి బోనీ కపూర్ ఎంతవరకు ఒప్పుకుంటాడో తెలియదు. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానిని కూడా అడిగారట. అయితే ఆమెకు ప్రస్తుతం ఖాళీ లేకపోవడంతో చిత్ర బృందం మరొక స్టార్ వేటలో పడినట్లు టాక్. ఫస్ట్ లిరికల్ వీడియో గా ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి మైత్రి బృందం ఆలోచిస్తోందట. అయితే సాంగ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయితే తప్ప ఈ విషయంపై ఒక స్పష్టత రాదు.


Also Read: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


Also Read: Poco M6 5G Vs Poco M6 Pro 5G: తక్కువ ధరలో లభించే ఈ రెండు శక్తివంతమైన మొబైల్స్‌లో ఇదే బెస్ట్‌..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter