Jani Master case update: 21 సంవత్సరాల వయసు కలిగిన జూనియర్ డాన్సర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.  సదరు బాధిత యువత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయించింది.  అయితే ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో రాయదుర్గం పోలీసులు ఆగస్టు 15 మధ్యాహ్నం సమయంలో జీరో ఎఫ్ ఐ ఆర్ ను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు  తరలించడం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధిత యువతి ఎఫ్ఐఆర్లో ఈ విధంగా ఆయన గురించి చెబుతూ పలు అంశాలు ఎఫ్ఐఆర్లో జోడించడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను అత్యాచారం చేశాడని,  చెన్నై నుండి ముంబై వెళ్ళినప్పుడు హోటల్స్ లో అలాగే నార్సింగిలో తన నివాసంలో కూడా తనను లైంగికంగా బెదిరించాడని ఆమె తెలిపింది. 


దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఇద్దరు అసిస్టెంట్ ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులు బాధితురాలు స్టేట్మెంట్ ను  రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలి ఇంట్లోనే మూడు గంటల పాటు విచారించిన పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. 


షూటింగ్ టైంలో క్యారవాన్ లో జానీ మాస్టర్ నన్ను బలవంతం చేశాడు ,తన కోరిక తీర్చమని నన్ను వేధించాడు. తన కోరిక తీర్చలేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడు. పెళ్లి చేసుకోవాలని కూడా నాపై ఒత్తిడి చేశాడు.. పలు నిజమైన పనులకు పాల్పడ్డాడు  అంటూ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. 


 



ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపించగా, బాధిత యువతి కూడా తాను పోలీసుల ముందుకు రాలేనని తెలిపింది. ఇకపోతే ఈ విషయం తెలియడంతో జానీ మాస్టర్ ను  జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా ఈయనపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్నారు జానీ మాస్టర్. ఇక ఈ విషయం బయటపడడంతో ఆయనను ఈ పదవి నుంచి తప్పించాలని పలువురు కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.


Also Read: Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం షెడ్యూల్‌ ఇదే! గంగలో కలిసేది ఈ సమయానికే


Also Read: Bank holidays in October: వామ్మో..అక్టోబర్‎లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ?  జాబితా ఇదే   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.