Jani Master - Ram Charan: ఈ మధ్యనే డాన్సర్ సతీష్, జానీ మాస్టర్ మధ్య వివాదం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టి మరి.. తన వైపు కథని చెప్పిన.. జానీ మాస్టర్ అందులో భాగంగా మాట్లాడుతూ ఈ మధ్యనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసనలను కలిశానని, డాన్సర్ లో హెల్త్ ఇన్సూరెన్స్.. గురించి మాట్లాడాను అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇప్పుడు జానీ మాస్టర్ రామ్ చరణ్, ఉపాసనలు.. తమ మాట మీద నిలబడ్డారు.. అంటూ ప్రశంసిస్తూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. తను కోరినట్టుగానే ఉపాసన.. డాన్సర్లకు హెల్త్ ఇన్సూరెన్స్.. ఇవ్వడానికి ఒప్పుకున్నట్లుగా.. ట్వీట్ ద్వారా తెలియజేస్తూ రామ్ చరణ్, ఉపాసనలతో దిగిన ఫోటోని షేర్ చేశారు జానీ మాస్టర్. 


"సరైన సమయంలో సహాయం చేసేవాడిని.. దేవుడు అంటారు. నా పుట్టినరోజు నాడు రామ్ చరణ్.. అన్న ఇంటికి పిలవగానే తనకి నామీద నా ప్రేమ.. చూసి చాలా సంతోషం వేసింది. అక్కడికి వెళ్ళాక చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి.. నా సంతోషం వెయ్యిరెట్లు అయ్యింది. ఈ మధ్యనే నేను అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మరి మా డాన్సర్ల యూనియన్ అయిన టీ ఎఫ్ టి టి డి ఎ లో 500+ కుటుంబాలకి.. హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలాగా చూస్తామని వారు మాట ఇచ్చారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని, తమ మాటలకు విలువనిస్తూ అన్ని కుటుంబాలను చేరదీయడం చిన్న విషయం కాదు. మా మనసుల్లో కృతజ్ఞతా భావం ఎల్లకాలం ఉండిపోతుంది. మా అందరి తరపు నుండి అన్నా వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీలాంటి వారితో పని చేయడం నా అదృష్టం" అంటూ ట్విట్ చేశారు జానీ మాస్టర్.


 



ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటూ.. రామ్ చరణ్, ఉపాసనలు చేసిన మంచి పనికి మెగా అభిమానులు.. వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Also Read: Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?


Also Read: Mahesh Babu: అభిమాని పాలిట మహేశ్‌ బాబు దేవుడు.. పేదింట చదువుల వెలుగులు నింపిన సూపర్‌స్టార్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter