Jathi Ratnalu collections: కరోనా కాలంలోనూ జాతి రత్నాలు కలెక్షన్స్ అదుర్స్
![Jathi Ratnalu collections: కరోనా కాలంలోనూ జాతి రత్నాలు కలెక్షన్స్ అదుర్స్ Jathi Ratnalu collections: కరోనా కాలంలోనూ జాతి రత్నాలు కలెక్షన్స్ అదుర్స్](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2021/04/06/207854-jathi-ratnalu-movie-collections-naveen-polishetty-faria-abdullah.jpg?itok=df3AkO_t)
Jathi Ratnalu movie total collections: నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కరోనావైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో అనేక ఆంక్షల మధ్య థియేటర్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ అవేవి జాతి రత్నాలు మూవీ కలెక్షన్స్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.
Jathi Ratnalu movie total collections: నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కరోనావైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో అనేక ఆంక్షల మధ్య థియేటర్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ అవేవి జాతి రత్నాలు మూవీ కలెక్షన్స్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా మార్చి 11న ఆడియెన్స్ ముందుకొచ్చింది.
జాతిరత్నాలు మూవీ విడుదలైన తొలి రోజు నుంచే సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. ఓపెనింగ్స్ పరంగానూ ఈ ఏడాది ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా జాతి రత్నాలు మూవీ పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది రిలీజైన అన్ని సినిమాల్లో ఉప్పెన మూవీ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సూపర్ హిట్ అయిన సినిమా ఇదే.
Also read : Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ వచ్చిందా ?
బాక్సాఫీస్ వర్గాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు జాతి రత్నాలు మూవీ వసూలు చేసిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం: 15.96 కోట్లు
సీడెడ్: 4.26 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.95 కోట్లు
గుంటూరు: 2.08 కోట్లు
ఈస్ట్ గోదావరి: 1.92 కోట్లు
కృష్ణా: 1.84 కోట్లు
వెస్ట్ గోదావరి: 1.52 కోట్లు
నెల్లూరు: 0.91 కోట్లు
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 54 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాగా 32.45 కోట్లు షేర్ రాబట్టింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.71 కోట్లు
ఓవర్సీస్: 4.25 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా జాతి రత్నాలు మూవీ టోటల్ కలెక్షన్స్ 68 కోట్లు కాగా 38.76 కోట్లు షేర్ రాబట్టినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లోనూ జాతి రత్నాలు మూవీకి మంచి రెస్పాన్స్ లభించిందని ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చెబుతున్నాయి. జాతి రత్నాలు మూవీ (Jathi Ratnalu movie) భారీ సక్సెస్ అవడంతో నవీన్ పొలిశెట్టికి మరిన్ని మంచి ఆఫర్స్ క్యూకడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook