Jawan Movie: 700 కోట్లు దాటిన జవాన్ కలెక్షన్స్.. తొమ్మిదో రోజు ఎంతంటే?
Jawan Movie: బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ బాద్ షా షారుఖ్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీ రూ.700 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఈ మూవీ తొమ్మిదో రోజు ఎంత వసూలు చేసిందంటే?
Jawan Box Office Collection Day 9: కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ పై తన దండయాత్రను కొనసాగిస్తున్నాడు. జవాన్ సినిమాతో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. తొమ్మిదో రోజు అయిన జవాన్ వసూళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ మూవీ రూ.700 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో రోజు రూ.21 కోట్లు నెట్ కలక్షన్స్ ను రాబట్టింది. అదే విధంగా ఈ మూవీకి రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. తక్కువ సమయంలోనే రూ.700 కోట్లను కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా జవాన్ చరిత్ర సృష్టించింది. 9వ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.410.88 కోట్లు నెట్ కలెక్షన్స్, రూ.730 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేయగలిగింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ మూవీలో షారుఖ్ కు జోడిగా నయనతార నటించింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. సీనియర్ నటి ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సుమారు రూ.300 కోట్లు బడ్జెట్ తో షారుఖ్ సతీమణి గౌరీఖాన్ నిర్మించారు. ఈ చిత్రానికి తొమ్మిది రోజుల్లో రూ. 410.88 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించడంతో.. ఇందులో నిర్మాత గౌరీ ఖాన్ కు రూ.110 కోట్లు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా జవాన్ వసూళ్లు కొనసాగితే మరికొన్ని రోజుల్లో వెయ్యి కోట్ల మార్కును సులువుగా క్రాస్ చేస్తోంది.
Also Read: Hi Nanna Movie: 'హాయ్ నాన్న' నుంచి బ్యూటీపుల్ మెలోడీ రిలీజ్.. మరోసారి మెస్మరైజ్ చేసిన హేషమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook