2024 Elections : `సీఎం`పై సినిమాలు.. అటు జీవా.. ఇటు బాలయ్య.. ఎన్నికలే లక్ష్యమా?
Tollywood Movies on 2024 Elections టాలీవుడ్‌లోనూ వచ్చే ఎన్నికల వేడి ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్ కోసం ఓ వర్గం, చంద్రబాబు కోసం ఇంకో వర్గం గట్టిగానే పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రెండు సినిమాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Balakrishna Boyapati Srinu CM Movie రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. అయితే ఏపీ ఎన్నికల ప్రభావం టాలీవుడ్ మీద గట్టిగానే పడేట్టు కనిపిస్తోంది. జనాలకు ఆకట్టుకుందుకు వైఎస్ జగన్ వర్గ సినిమాలను ప్లాన్ చేస్తోంది. యాత్ర 2 అంటూ వైఎస్ జగన్ బయోపిక్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో తమిళ హీరో జీవా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
బాలయ్య కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. దానికి సంబంధించి పవర్ ఫుల్ కథను బోయపాటి సిద్దం చేశాడని టాక్. ఈ సినిమాకు సీఎం అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. ఇది పక్కా పొలిటికల్ డ్రామాగా ఉంటుందని, అధికార పక్షం మీద కౌంటర్లు వేసేలానే ఉంటుందని టాక్. ఇక వైఎస్ జగన్ కోసం రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా తీస్తాడని సమాచారం.
జగన్‌కు పాజిటివ్‌గా చూపించే సినిమాలు ఒక వైపు.. జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తప్పులు ఎత్తి చూపే సినిమాలు కూడా రాబోతోన్నట్టుగా ఉన్నాయి. అయితే వీటి ప్రభావం జనాల మీద ఏమైనా ఉంటుందా? అసలు సినిమాలు చూసి జనాలు ఓటు వేస్తారా? అన్నది చూడాలి. అయితే బోయపాటి బాలయ్య అయితే ఇది వరకు రాజకీయంగా సినిమాల్లో ఎన్నో సెటైర్లు వేశారు. పార్టీల మీద కౌంటర్లు వేశారు.
Also Read: Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే
ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బోయపాటి బాలయ్య ఇంకెన్ని సెటైర్లు వేస్తారో చూడాలి. అయితే యాత్ర 2 విషయంలో మహి వీ రాఘవ మాత్రం జగన్ గురించి పాజిటివ్ అంశాలు మాత్రమే చూపిస్తాడని టాక్. ఎదుటి వారి మీద కౌంటర్లు వేయడం, సెటైర్లు వేయడం వంటివి ఉండవని తెలుస్తోంది.
Also Read: Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook