Jeevitha Comments On Komati Caste: సినీ నటి జీవిత మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. జీవిత నోరు జారి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి జీవిత నోట ఒక కులానికి సంబంధించిన మాట రావడం ఆమెను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. రాజశేఖర్ హీరోగా రూపొందిన శేఖర్ మూవీ విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా శేఖర్ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చందానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను రాజశేఖర్ సతీమణి జీవిత స్వయంగా డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో రాజశేఖర్ కుటుంబం మొత్తం పాల్గొంది. ఎలా అంటే.. రాజశేఖర్ ఈ సినిమాలో హీరో కాగా, జీవిత ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక వీళ్ల ఇద్దరు కూతుళ్లయిన శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ నేపథ్యంలోనే శేఖర్ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్ లోనూ రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. ఈ క్రమంలోనే స్టేజీపై శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ అడిగిన పలు ప్రశ్నలకు ఇద్దరూ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే.. మీ ఇద్దరిలో ఎవరు దేనిపై ఎక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్న రాగా.. శివాని, శివాత్మిక ఇద్దరూ '' ఫుడ్ '' అనే సమాధానం ఇచ్చారు. అయితే, ఆ ఇద్దరిలోనూ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు జీవిత స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలే ఆమెను నోరుజారేలా చేశాయి.


Also read : Hero Vijay Meet KCR: కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నారా?


Also read : Mahesh Babu Trolls: మహేష్ బాబును బాలీవుడ్ భరించలేదు కానీ.. పాన్ మసాలా భరిస్తుందా!


Also read : Karate Kalyani Vs Srikanth Reddy: కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి వివాదం బయటపెట్టిన నిజాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook