Jeevitha Sensational Comments
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చెరగని ముద్ర వేసిన అద్భుతమైన నటి జీవిత. ఏ పాత్రలో అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి.. అద్భుతంగా నటించే టాలెంట్ ఉన్న హీరోయిన్ గా 80వ దశకంలో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంకుశం సినిమా చేస్తున్న సమయంలో తన సహనటుడు రాజశేఖర్ ప్రేమలో పడిన ఆమె కొంతకాలానికి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ నటనకు దూరమైంది. ఆ తర్వాత కాలంలో ప్రొడక్షన్, డైరెక్షన్ వంటి పలు విభాగాలలో తనదైన ముద్ర వేసింది. సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన పనులతో పాటుగా రాజకీయాలలో కూడా జీవిత చురుకుగా పాల్గొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న జీవిత ఔట్ స్పోకెన్ పర్సనాలిటీ కారణంగా ఆమె చుట్టూ కొన్ని వివాదాలు ముసురుకున్నాయి. మెగాస్టార్ నిర్వహించిన బ్లడ్ బ్యాంకు కు సంబంధించి గతంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఆమెను చాలా రోజులు వెంటాడాయి. చివరికి కోర్టు, జైలు శిక్ష విధించేటంతవరకు పరిస్థితులు వెళ్లాయి. ఎలాగో ఈ కేసు నుంచి బయటపడ్డ జీవిత.. ఆ తర్వాత నుంచి చాలా వరకు మీడియాకు కనిపించడం మానేశారు.


ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవిత.. తాను దేని గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను అని చెప్పింది. ఇది కేవలం తన కూతుర్ల కెరీర్ బాగుండాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు ఆమె ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు పైనే దాటింది. ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకొని ఒక స్థాయికి చేరుకున్న ఆమె ఏదైనా ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది. అయితే ఇలా మాట్లాడడం అందరికీ నచ్చదు కదా.. అందుకే ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది అని భావించిందట. అన్నిటి గురించి మనం స్పందించనంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు కదా అని భావించిన జీవిత కామ్ గా ఉన్నారట.


ప్రస్తుతం జీవిత రాజశేఖర్ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే అది వాళ్ళ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే తమ కారణంగా పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోటే ఆమెతోపాటు ఆమె భర్త రాజశేఖర్ కూడా మౌనంగా ఉంటూ వస్తున్నారట. అయితే ఇది భయంతో చేసిన పని కాదని.. ఇలా అనవసరంగా అన్నిటికీ స్పందించడం మానేయడం వల్ల తాము ఎంతో ప్రశాంతంగా ఉన్నామని జీవిత పేర్కొన్నారు. యాక్టింగ్ నుంచి చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న జీవిత రీసెంట్గా రజనీకాంత్ నటించిన లాల్ సలాం మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఇకపై ఆమె నుంచి మరిన్ని అద్భుతమైన చిత్రాలు వచ్చే అవకాశం కూడా ఉంది.


Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook