Jitender Reddy Trailer Talk: ట్విస్టులతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న `జితేందర్ రెడ్డి` ట్రైలర్.. బయోపిక్ పై పెరుగుతున్న అంచనాలు..
Jitender Reddy Trailer Talk: తెలుగు తెరపై ఇప్పటి వరకు అన్నలపై పాజిటివ్ దృక్పథంతోనే సినిమాలు తెరకెక్కాయి. ఇక నక్సలిజంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ ఒక్కొక్కటిగా సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో బయోపిక్ మూవీ `జితేందర్ రెడ్డి`. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
Jitender Reddy Trailer Talk Review: నక్సలిజం తెలుగు సహా వెండితెరపై కొన్నేళ్లుగా సూపర్ హిట్ ఫార్ములా. ఇక పోలీస్ వాళ్లలో మంచి వాళ్లు.. చెడ్డవాళ్లు ఉన్నట్టే.. నక్సలిజంలో కూడా మంచి చెడులు రెండు ఉన్నాయి. ఒకపుడు పీడిత వర్గాల కోసం గన్ చేతబట్టిన అడవుల బాట బట్టిన అన్నలకు ప్రజల్లో మంచి అభిప్రాయాలు ఉండేవి. అయితే ఇదంత నాణేనికి ఒకవైపు మాత్రమే. వాళ్లలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. వ్యాపారస్థులు, ఇతర వర్గాల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడే వసూల్ రాజాలు కూడా నక్సలైట్స్‌లలో ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో నక్సలైట్స్ చేస్తోన్న ఆరాచకాలపై 1980లలో తిరుగు బాటు చేసిన జగిత్యాల చెందిన జితేందర్ రెడ్డి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు విరంచి వర్మ.
ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె ఈ సినిమాలో టైటిల్ రోల్లో నటించారు. 1980లో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పూర్తి పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.
వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
చిన్నప్పటి నుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పపెరిగి పెద్దవాడవుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదుగుతాడు. ఆ తరవాత పోలీసు వ్యవస్థకే ధీటుగా.. మాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళాతాడు. ట్రైలర్ మధ్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. 1980లో ఒక వ్యక్తి జీవితంలో జరిగే కళాశాల రాజకీయాలు.. ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతుంది. మొత్తానికి కంటెంట్ మాత్రం ప్రోమిసింగ్ గా ఉంది, మే 10న ‘జితేందర్ రెడ్డి భారీ ఎత్తున విడుదల కాబోతుంది.
ఇదీ చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter