Attack Teaser: దేశాన్ని రక్షించేందుకు వచ్చిన మొదటి ఇండియన్ హ్యూమన్ రోబోట్ సోల్జర్.. ఎటాక్ టీజర్ అదిరిందిగా!!
లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా `ఎటాక్`. సినిమా ప్రొమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఈరోజు ఎటాక్ టీజర్ విడుదల చేసింది. జాన్ అబ్రహం సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌లుగా నటించారు.
John Abraham, Jacqueline Fernandez and Rakulpreet Singh's Attack Teaser is out: లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో జాన్ అబ్రహం (John Abraham) హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా 'ఎటాక్' (Attack ). పూర్తి యాక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం రోబోట్ సోల్జర్‌గా నటించారు. భవిష్యత్తులో టెక్నాలజీ ఆధారంగానే యుద్ధాలు జరుగుతాయనే కోణంలో ఈ సినిమా రోపొందించారు. దేశాన్ని పీడిస్తున్న ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి భారత్.. స్వంత కృత్రిమ మేధస్సు గల సూపర్ సైనికుడి (రోబోట్ సోల్జర్)ని రంగంలోకి ఎలా దించిందన్నది ఇందులో చూపించనున్నారు. జాన్ అబ్రహం సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) మరియు రకుల్‌ప్రీత్ సింగ్ (Rakulpreet Singh) హీరోయిన్‌లుగా నటించారు.
నిజానికి ఎటాక్ సినిమాని గత ఆగస్టు 14న దేశవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు 2022 జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రొమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఈరోజు ఎటాక్ టీజర్ (Attack Teaser) విడుదల చేసింది. పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఘటనతో టీజర్ ఆరంభం అవుతుంది. ఆపై రోబోట్ సోల్జర్‌గా జాన్ అబ్రహం (John Abraham) దేశాన్ని ఎలా కాపాడు అని చూపించారు. రకుల్‌ప్రీత్ సింగ్ (Rakulpreet Singh) శాస్త్రవేత్తగా కనిపించారు. ఈ టీజర్ ఇప్పటికే వైరల్ అయింది.
Also Read: Virat Kohli - BCCI: అవన్నీ గాలి వార్తలే.. విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడుతాడు: బీసీసీఐ
జాన్ అబ్రహం తన సోషల్ మీడియా ఖాతాలో ఎటాక్ టీజర్ వీడియోను పంచుకున్నారు. 'భారతదేశం మొట్టమొదటి సూపర్ సైనికుడి మేకింగ్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి. టీజర్ ఇప్పుడే విడుదల చేయబడింది. ఎటాక్ సినిమా జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల అవుతుంది' అని ట్వీట్ చేసారు. 'దేశానికి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సూపర్ సైనికుడు (Super Soldier) చివరకు దేశాన్ని రక్షించడానికి వచ్చాడు' అని రకుల్‌ప్రీత్ సింగ్ (Rakulpreet Singh) ట్వీట్ చేశారు. జయంతిలాల్ గదా, జాన్ అబ్రహం, అజయ్ కపూర్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read: Covid Cases in India: దేశంలో స్వలంగా పెరిగిన కొవిడ్ కేసులు- కొత్తగా 6,984 కేసులు, 247 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి