Josh Ravi struggles వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక సీన్ ఉంటుంది. రవితేజ పోస్టర్‌ను చిరంజీవి ప్రేమగా తుడిచేస్తుంటాడు. ఆ సీన్ చూస్తే ప్రేక్షకులు ఎమోషనల్‌ అవుతారు. అదే సీన్ ఒక వేళ రియల్ లైఫ్‌లో జరిగితే జనాల హృదయం కరిగిపోకుండా ఉంటుందా? ఇప్పుడు అదే జరిగింది. ఓ పెద్దాయన వాల్తేరు వీరయ్య పోస్టర్‌ను చూసి తన లుంగీతో చిరంజీవి బొమ్మను తుడిచేస్తుంటాడు. ఆ వీడియోను చూసి అంతా ఫిదా అయ్యారు. కానీ ఇంత వరకు ఆ వ్యక్తి ఎవరన్నది కనుక్కోలేకపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఆ వ్యక్తిని మెగా అభిమాని అయిన జోష్ రవి వెతికి పట్టుకున్నాడు. రవి ఇంటి ముందున్న 'వాల్తేరు వీరయ్య' పోస్టర్ దగ్గర ఆగి, ఆ పోస్టర్లోని చిరంజీవి బొమ్మను చూస్తూ, చిన్న పిల్లాడిలా మురిసిపోయి, తనను తాను మరిచిపోయి.. చిరంజీవి బొమ్మకు ముద్దాడుతూ రవి కెమెరాకు చిక్కి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. ఆ వీడియోలోని పెద్దాయన్ని, చిరంజీవి గారి మీద ఆయనకున్న అభిమానాన్ని తెలుగు సినిమా ప్రేక్షకలోకానికి పరిచయం చేయాలనుకున్నాడు రవి.


ఒక సినిమా నటుడు బయట కనిపిస్తే సిటీల్లోనే జనం ఎలా చుట్టుముడతారో మనకు తెలియనిది కాదు, అలాంటిది ఒక చిన్నపాటి ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయినా సరే - మార్టేరు చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళన్నీ స్వయంగా తిరిగి, ప్రతీ ఇల్లు జల్లెడపట్టి మరీ ఆయన్ని కనుక్కున్నాడు. ఇలా మన ముందుకు తీసుకొచ్చాడు రవి.


ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చిరంజీవి వీర విహారం చేస్తున్నాడు. ఓవర్సీస్‌లో ఆల్రెడీ రెండు మిలియన్ల డాలర్లను క్రాస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను టచ్ చేసింది. ఇప్పటికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 160 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసినట్టు తెలుస్తోంది.


Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?


Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook