Jr NTR-Allu Arjun: క్యూలో నిలబడి ఓట్లు వేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్…వీడియోలు చూశారా
AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది. ఓట్లు వేయడానికి అందరూ సిద్ధమైపోయారు. మన టాలీవుడ్ హీరోలు సైతం ఉదయాన్నే లేచి క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు.
Jr NTR-Allu Arjun: ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జోరు మొదలయింది. ఉదయాన్నే లేచి తమ బాధ్యతను నిర్వర్తించుకోవడానికి అందరూ వెళ్లి మరీ ఓట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అందరికన్నా ముందు తన ఫ్యామిలీతో వెళ్లి ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు. ఇక మరోపక్క అల్లు అర్జున్ కూడా తన ఓటు వేయడానికి క్యూ లైన్ లో కనిపించారు.
జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి, సతీమణి ప్రణతితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రానికి ఉదయాన్నే ఏడు గంటలకు అంతా చేరుకున్నాడు. అందరితో కలిసి క్యూలైన్‌లో నిలుచుకొని..తన వంతు వచ్చినప్పుడు ఆయన ఓటు వేశారు. ఇక మరోపక్క ఉదయాన్నే ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్.. అందరితోపాటు ఆయన తన వంతు కోసం క్యూలైన్‌లో వేచిఉండి మరి ఓటు వేశారు. కాగా నిన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ వార్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నారు. నిన్న రాత్రి ముంబై నుంచి ఓటు వేయడానికి హైదరాబాద్ చేరుకున్నారు ఈ హీరో. మొత్తానికి షూటింగ్స్ తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదుకి వచ్చి తన ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవడం ఆయన అభిమానులకు సైతం ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది.
అనంతరం అల్లు అర్జున్ మీది కాదు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఇక కొంతమంది మీరు పాలిటిక్స్ లోకి వస్తారా అని అల్లు అర్జున్ ని అడగగా లేదు లేదు అసలు రాను అని చెప్పుకొచ్చాడు ఈ హీరో. కాగా ఈ మధ్యనే అల్లు అర్జున్ నంద్యాలలోని తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
ఇక మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తన సతీమణితో కలిసి ఫిలింనగర్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాలలో, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాదాపూర్‌లో ఓటేవేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook