Jr NTR-Koratala Siva:  ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ ఘాటింగ్ ముగించుకుని..ఫ్యామిలితో ఫారెన్ ట్రిప్ చెక్కేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR). గత రెండు రోజులుగా తారక్ తనయులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట(Social Media) తెగ వైరల్  అవుతున్నాయి. త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివ(koratala siva)తో మూవీని మెుదలపెటనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: తనయుడు భార్గవ్ రామ్‌తో తారక్.. వైరల్ అవుతున్న లవ్లీ ఫోటో


 తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొరటాలతో చేయనున్న సినిమా రివేంజ్ డ్రామా(Revenge Drama). ఇది ఫిబ్రవరిలో ప్రారంభంకానుంది. ఆరు, ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాము. నందమూరి కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neil)దర్శకత్వంలోని ప్రాజెక్ట్ అక్టోబర్లో పట్టాలెక్కనుంది. ఇది కేజీఎఫ్ తరహాలో సాగే భారీ యాక్షన్ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు తారక్.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook