Variety Magazine Oscar Predictions ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ సినిమా ఉంటుందని, రాజమౌళికి ఈ సారి అవార్డు రావాల్సిందేనని అంతర్జాతీయ మీడియా బాగానే కథనాలు ప్రచురిస్తోంది. పైగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అయితే ఏకంగా దర్శకుధీరుడిని బెస్ట్ డైరెక్టర్‌గా అనౌన్స్ చేసింది. నేడు అవార్డును కూడా ఇచ్చేసింది. అయితే ఇప్పుడు వెరైటీ మ్యాగజైన్ అనే అంతర్జాతీయ సంస్థ ఆస్కార్‌ బరిలో నిలిచే బెస్ట్ యాక్టర్‌ల లిస్ట్‌ను అంచనా వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఈ సారి ఉత్తమ నటుడి కేటగిరీలో ఎన్టీఆర్ పేరుని జోడించింది. ప్రిడిక్షన్ లిస్ట్‌లో పదిమంది ఉత్తమ నటుల్లో మన ఎన్టీఆర్ పేరుని కూడా జోడించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఇక ఎన్టీఆర్‌కు ఆస్కార్ అవార్డు వచ్చే చాన్సులు ఎక్కువగానే ఉన్నాయంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


మరి నిజంగానే ఎన్టీఆర్‌కు అవార్డు వస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే.. మన ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం అంతర్జాతీయ ముద్ర వేసింది. ఆల్రెడీ రాజమౌళిని ఉత్తమ దర్శకుడు అని అంగీకరించారు. గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌లోనూ ఆర్ఆర్ఆర్ సెలెక్ట్ అయింది. ఇటు ఆస్కార్, అటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి.


రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఇక జపాన్‌లో అయితే అప్పుడెప్పుడో రజనీకాంత్ ముత్తు సినిమా క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కొల్లగొట్టేసింది. అలా ఆర్ఆర్ఆర్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు పన్నెండు వందల కోట్లను కొల్లగొట్టినట్టు అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ 
సీక్వెల్ ఐడియా కూడా ఈ మధ్య వచ్చినట్టుగా రాజమౌళి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.


అయితే సీక్వెల్ ఐడియా అనేది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, కథగా లేదని, అది ఎప్పుడు రెడీ అవుతుందో చెప్పలేనని, దాని మీద తాను, తన తండ్రి కలిసి పని చేస్తున్నామని రాజమౌళి ఇంటర్నేషనల్ వేదికల మీద చెబుతూ వస్తున్నాడు.


Also Read: Tamannaah Bhatia Dating : విలన్‌తో ప్రేమలో తమన్నా.. ముద్దుల్లో తేలిపోతోన్న జంట


Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి