Jr NTR Fan Kaushik: క్యాన్సర్‌తో పోరాడుతున్నా కూడా తన హీరోపై అభిమానం తగ్గలేదు. తాను చనిపోయేలోపు కచ్చితంగా దేవర సినిమా చూడాలని కోరుకున్న ఆ అభిమానికి ఏకంగా అతడు అమితంగా ఆరాధించే జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందిస్తే ఆ బాధితుడికి పునర్జన్మ లభించినంత పని అయ్యింది. తాను కలలో కూడా ఊహించని వ్యక్తి నుంచి వీడియో కాల్‌ లభించడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఫోన్‌లో ప్రత్యక్షమై తనతో మాట్లాడడంతో నోటి నుంచి సరిగ్గా మాటలు రాలేదు. ఈ సందర్భంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆ యువకుడిలో ధైర్యం నూరి పోశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Entertainment news: పనిమనిషి అంటూ ఇంట్లో చేరిన మంత్రి కుమార్తె.. కట్ చేస్తే..!


ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కౌశిక్‌ (19) బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కౌశిక్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఎప్పుడూ ఎన్టీఆర్‌ను అభిమానిస్తూ ఉండే కౌశిక్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాడు. అయితే అతడి క్యాన్సర్‌ చికిత్సకు భారీగా ఖర్చవుతోంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల శ్రీకాంత్‌ తల్లి దాతల సహాయం ఆర్థించారు. తాను చనిపోయేలోపు ‘దేవర’ సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు అతడి తల్లిదండ్రులు ఇటీవల చెప్పిన వీడియో వైరలయ్యింది. ఆ వీడియో కాస్త ఎన్టీఆర్ దృష్టికి వెళ్లింది.

Also Read: Thalapathy 69: విజయ్ ఆఖరి సినిమా అప్డేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పేసిన నిర్మాణ సంస్థ..


తన అభిమాని అనారోగ్యంతో పోరాడుతుండడంతో ఎన్టీఆర్‌ కలతచెందారు. వెంటనే తన అభిమానుల ద్వారా విషయం తెలసుకుని కౌశిక్‌ నంబర్‌ను సంప్రదించాడు. ఈ సందర్భంగా అతడితో వీడియో కాల్‌ మాట్లాడాడు. 'ధైర్యంగా కోలుకుని బయటకు రావాలి. దేవర సినిమా చూడాలి. సినిమా అనేది తర్వాత నువ్వు ముందు కోలుకుని రావాలి. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి' అని ఎన్టీఆర్‌ తన అభిమాని కౌశిక్‌కు భరోసా ఇచ్చారు. అయితే కౌశిక్‌ మాట్లాడేందుకు తడబడ్డాడు. 'అన్న మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు' అని కౌశిక్‌ చెప్పగా.. 'నేను మాట్లాడకపోతే ఎలా నీతో' అని తారక్‌ మాట్లాడాడు. ఈ వీడియో కాల్‌తో కౌశిక్‌ ఎప్పుడూ లేని ఉత్సాహంగా కనిపించాడు.

ఎన్టీఆర్‌ మాటలతో కౌశిక్‌లో మానసిక స్థితి పెరిగిందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అతడికి ధైర్యం చెబుతూనే త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్‌ ఆకాంక్షించాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాడు. ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూసి ఎన్‌టీఆర్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.


కొరాటల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌తో జోడీ ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్‌, ట్రైలర్‌ విడుదలయి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్‌ హిట్‌గా నిలిచాయి.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.