Devara 1st Review: విడుదలకు ముందే ‘దేవర’ పేరిట పలు ప్యాన్ ఇండియా రికార్డులు.. ఎన్టీఆర్ మాస్ రచ్చకు బాక్సాఫీస్ షేక్..
Devara 1st Review: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే పలు రికార్డులను తన పేరిట రాసుకుంది.
Devara 1st Review: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఎన్టీఆర్ క్రేజ గ్లోబల్ లెవల్ కు పెరిగింది. అంతేకాదు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై మెరిచింది. ఈ సినిమా తర్వాత ఎన్నో కథలను విన్నా.. చివరకు కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తోన్న తొలి ప్యాన్ ఇండియా మూవీ. సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇదే ఫస్ట్ మూవీ. ఈ మూవీ విజయం అనేది తారక్ కీలకం అని చెప్పాలి. తాజాగా ఈ సినిమా యూస్ బాక్సాఫీస్ దగ్గర విడుదలకు ముందే పలు రికార్డులను అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీ సేల్స్ ప్రీమియర్స్ ద్వారానే $ 2 మిలియన్ యూఎస్ డాలర్స్ క్రాస్ చేసి సంచలనం రేపింది. నార్త్ అమెరికాలో ఏ భారతీయ హీరో సినిమాకు విడుదలకు ముందే ఈ రేంజ్ వసూళ్లు దక్కలేదు.
ఒక రకంగా మాస్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో ఈ మూవీ ప్రూవ్ చేసింది. నార్త్ అమెరికాలో మన భారత దేశ హీరోల పరంగా ప్రీమియర్స్ రూపంలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపేణా $2 మిలియన్ యూఎస్ డాలర్స్ ను తక్కువ మందే అందుకున్నారు. అప్పట్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ సేల్స్ రూపంలో $2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. తాజాగా ఈ రికార్డును ‘దేవర’ మూవీ క్రాస్ చేసింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర మూవీతో బ్యాక్ టూ బ్యాక్ ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపేణా అందుకోవడం విశేషం.
ఒక రకంగా భారత దేశంలో ప్రీ బుకింగ్స్ రూపేణా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన హీరోగా ఎన్టీఆర్ పేరిట రికార్డు నమోదు అయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం రెండు నిమిషాల్లో చాలా చోట్ల టికెట్స్ క్షణాల్లో అయిపోయాయి. ఓ రకంగా హీరోగా ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో చెబుతుంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ వేస్తున్నారు. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో 320 పైగా స్పెషల్ షోస్ వేస్తున్నారు. తెలంగాణలో దాదాపు 100 వరకు అదనపు షోలు వేస్తున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్స్ పెంపు కూడా కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. ఈ ఊపు చూస్తుంటే.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపేణా.. ఈ సినిమా తొలి రోజే రూ. 100 కోట్ల గ్రాస్ ఈజీగా క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండే అవకాశాలున్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 182.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ గా రూ. 184 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగుతుంది. సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.