Devara Collections: జూనియర్ ఎన్టీఆర్.. హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర‌. మొదటి షో తో యావరేజ్ టాక్.. సొంతం చేసుకున్న ఈ చిత్రం పోను పోను.. మంచి టాక్ సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. మాస్ ఆడియన్స్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఈ చిత్రం ఎంతో మెప్పిస్తుంది. ఈ చిత్రంతో కొరటాల శివ తన కెరియర్లో మరొక విజయాన్ని అందుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాన్వి కపూర్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సైతం ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలంద పరిచయం కావడం విశేషం. ముఖ్యంగా ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర కలెక్షన్స్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.


భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ‘దేవ‌ర‌’ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విడుదలై మూడు రోజులు కావస్తుండగా.. ఈ చిత్రం తొలి రోజున రూ.172 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి.. మిగతా రెండు రోజులు కూడా అదే హావాని కొనసాగించింది. ఇక గత వారాంతం గడిచేసరికి.. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి.. దాదాపు 80 శాతం రిక‌వ‌రీ అయ్యింది.


అంతే బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడానికి.. ఈ సినిమా ఇంకా కేవలం 20% మాత్రమే సంపాదించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  రూ.87.69 షేర్ క‌లెక్ష‌న్స్ సాధించి ఎన్టీఆర్ హవాని చూపించింది ఈ చిత్రం. అలాగే హిందీలో కూడా ఈ సినిమా గడిచేకొద్దీ పాజిటివ్ టాక్.. సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ జోరు పెంచుకుంటోంది.


ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్, అలీ ఖాన్ తో పాటు.. శ్రీకాంత్, ప్ర‌కాష్ రాజ్‌, అజయ్ షైన్ టామ్ చాకో, అజ‌య్‌, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ చిత్రంతో పాటు తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది.


Also Read: MP Dharmapuri Arvind: కాంగ్రెస్ ఆ హామీ చూసి నాకే ఓటు వేయాలనిపించింది.. ఎంపీ ధర్మపురి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 


Also Read: Hyderabad to Ayodhya Flight Service: రామభక్తులకు అదిరిపోయే శుభవార్త..  భాగ్య నగరం నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.