Jr NTR: ఆ ఏరియాల్లో రికార్డు రేటుకు అమ్ముడు పోయిన ఎన్టీఆర్ దేవర థియేట్రికల్ రైట్స్..
Jr NTR - Devara: ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం.
Jr NTR - Devara: రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అంతేకాదు ఈ సినిమా మన దేశంలోనే కాదు.. జపాన్ వంటి విదేశాల్లో దుమ్ము దులిపింది. ఈ సినిమా సక్సెస్ లో తారక్ పాత్రతో పాటు.. రామ్ చరణ్ పాత్ర.. రాజమౌళి టేకింగ్.. వంటివి కలిసొచ్చి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ మూవీ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ కొరటాల శివ ధర్శకత్వంలో ‘దేవర’ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా పవన్ కళ్యాణ్ ‘ఓజీ ’ మూవీ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ లో సెప్టెంబర్ 27న సోలో డే్ట్ లో విడుదల అవుతుంది దేవర్ పార్ట్ -1.
ఈ సినిమా విడుదలకు మరో రెండు నెలలు టైమ్ ఉన్నా.. ఇప్పటికే అన్ని ఏరియాలకు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ బిజినెస్ పూర్తి కావొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 110 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఈ సినిమా ఆడియో రైట్స్ ను టి సిరీస్ దాదాపు రూ. 25 కోట్లుకు అమ్ముడుపోయిందట. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను దాదాపు రూ. 60 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 150 కోట్లకు అమ్ముడుపోయిందట.
ఇప్పటికే ఈ సినిమా కర్ణాటక రూ. 16 కోట్ల నుంచి రూ. 18 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైయినట్టు సమాచారం. అటు రాయలసీమలో దాదాపు రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక హిందీలో ఈ సినిమా దాదాపు రూ. 30 కోట్ల వరకు బిజినెస్ చేసిందట.
ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు.
Also read: Mumbai Red Alert: వరద గుప్పిట్లో ముంబై, రానున్న 24 గంటల్లో జల ప్రళయం విరుచుకుపడనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook