Devara Pre-release Business: ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుని ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దేవర అనే ఆసక్తికరమైన టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. శృతి మరాటే కూడా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర పోషిస్తుండగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ వంటి స్టార్ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే దేవర పార్ట్ 1 ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర థియట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 130 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.  


ఇక సౌత్ లో ఇతర స్టేట్స్, నార్త్ స్టేట్స్ కూడా కలిపి 50 నుంచి 60 కోట్ల బిజినెస్ నమోదయింది. ఓవర్సీస్ లో చిత్ర థియట్రికల్ రైట్స్ ను హంసినీ ఎంటర్టైన్మెంట్ వారు 27 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇక నెట్ఫ్లిక్స్ వారు సినిమా ఓటిటి రైట్స్ కోసం ఏకంగా 155 కోట్లు చెల్లించారు. చిత్ర ఆడియో రైట్స్ ను 33 కోట్ల కు టీ సిరీస్ వారికి అమ్మగా విడుదలకి ముందే సినిమా నాలుగు వందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా సాటిలైట్ రైట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కూడా.


నిజానికి సినిమా ట్రైలర్ లేదా సినిమా నుంచి ఒక్క పాట కూడా విడుదల కాలేదు కానీ అప్పుడే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. మొదటి భాగానికి ఈ రేంజ్ అంచనాలు ఉంటే ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే సినిమా రెండవ భాగం కూడా రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌.. రేవంత్‌ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలం


Also Read: Revanth Reddy: 'కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం': రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter