Devara Pre Release Business: మైండ్ బ్లాంక్ చేస్తోన్న‘దేవర’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. ఎన్టీఆర్ ముందు పెద్ద టార్గెట్..!
Devara Pre Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Devara Pre Release Business: రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్యాన్ ఇండియా సినిమాతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు ఎన్టీఆర్. ఇందులో తన తోటి హీరో రామ్ చరణ్ తో ఎన్టీఆర్ చేసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకుని తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. అటు వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. అందులో మొదటి భాగం ‘దేవర పార్ట్ -1’ సినిమా సెస్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ లతో ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ మూవీని తెరకెక్కించిన కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. మరోవైపు ఈయన ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు హిట్ కాంబోలో ఈ సినిమా ‘దేవర’ సినిమా రాబోతుంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అటు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం).. రూ. 44 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ).. రూ. 22 కోట్లు..
ఉమ్మడి ఉత్తరాంధ్ర.. 12.40 కోట్లు
ఉమ్మడి తూర్పు గోదావరి.. రూ. 7.75 కోట్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 6.50 కోట్లు..
ఉమ్మడి గుంటూరు.. రూ. 8.50 కోట్లు..
ఉమ్మడికృష్ణా.. రూ. 7.20 కోట్లు..
ఉమ్మడి నెల్లూరు..రూ. 4.20 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 112.55 కోట్లు
కర్ణాటక.. రూ. 16 కోట్లు..
తమిళనాడు. రూ. 6 కోట్లు..
కేరళ.. రూ. 1 కోటి
హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి.. రూ. 20 కోట్లు
ఓవర్సీస్.. రూ. 27 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ. 182.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ గా రూ. 184 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగుతుంది.
సోలో హీరోగా ఎన్టీఆర్ కు ఇది బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఒక రకంగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో వెంటనే హిట్టు కొట్టిన దాఖలాలు లేవు. మరి ఎన్టీఆర్.. ‘దేవర’ సినిమాతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేకులు వేస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. మొత్తంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ .. రెండు పాత్రలు కాదు.. మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపిస్తాడా.. ! మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడా అనేది చూడాలి. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ నార్త్ అమెరికా సహా పలు దేశాల్లో $2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ టికెట్స్ క్షణాల వ్యవధిలో అమ్ముడుపోయాయి. పైగ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఓ వారం రోజుల పాటు అదనంగా రెండు షోలతో పాటు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. మొత్తంగా ‘దేవర’కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని చెప్పాలి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.