Jr NTR Fans Over Action ఎన్టీఆర్ అభిమానులు థియేటర్లో హంగామా చేస్తున్నారు. సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేయాలని నెల క్రితమే ఫిక్స్ అయ్యారు. దీని కోసం నెల ముందు నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనికోసం ఏకంగా రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టేశారు. అలా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసి సింహాద్రి సినిమాను థియేటర్లోకి తీసుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశ్వక్ సేన్ అయితే అభిమానులను ముందుగానే హెచ్చరించాడు. సింహాద్రి రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వక్ సేన్.. థియేటర్లను జాగ్రత్తగా చూసుకోండని, సీట్లు చించడం, స్క్రీన్లు చించడం వంటివి చేయకండని హెచ్చరించాడు. కానీ అభిమానులు మాత్రం ఆ మాటలను పెడ చెవిన పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు విజయవాడలోని అప్సర థియేటర్లో యంగ్ టైగర్ అభిమానులు చేసిన హంగామా వైరల్ అవుతోంది.


 



అసలే ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్.. ఊపు మీదున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ అయితే జల్సా, ఖుషి, ఆరెంజ్ సినిమాలతో సందడి చేశారు. రీ రిలీజ్‌ల విషయంలో ఈ మూడు సినిమాలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు సింహాద్రిని రీ రిలీజ్‌ను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగానే ఇలా కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.


Also Read:  Ram Charan Speech : నందమూరి అభిమానుల మనసు గెలిచిన రామ్ చరణ్.. ఎన్టీఆర్‌పై స్పీచ్ అదుర్స్


విజయవాడలోని అప్సర థియేటర్లో అభిమానులు హంగామా చేశారు. థియటేర్లోనే బాణాసంచా కాల్చారు. దీంతో మంటలు చెలరేగాయి. వెంటనే పోలీసులు వచ్చి షోను నిలిపివేశారు. అక్కడ అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అయితే ఇలా అభిమానులు ప్రతీ సారి హద్దులు దాటడం, థియేటర్లకు ఏదో ఒక నష్టాన్ని కలగజేస్తుండటంతో ఈ రీ రిలీజ్‌ల ట్రెండ్‌ను కూడా ఆపేస్తారేమో అని అంతా అనుకుంటున్నారు.


Also Read:  Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook