#JrNTRFootNaraDogs Trending in Social Media: ఆంధ్రప్రదేశ్లోని అధికారిక హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. ఒక రకంగా రాజకీయ వర్గాలన్నింటిని ఈ వ్యవహారం పట్టి కుదిపేసింది. తెలుగుదేశం పార్టీ ఎలా అయినా పేరు మార్చడం కుదరదు అంటూ గవర్నర్కు కూడా వినతి పత్రాలు సమర్పించింది. ఈ పేరు మార్పు అన్యాయం అని పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామని టిడిపి అయితే ముందు నుంచి చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ఈ వ్యవహారం మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందన తెలుగుదేశం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా ఇలాగే అంటీ ముట్టనట్టు వ్యవహరించాడని, భువనేశ్వరుని అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో దూషించినా సరే ఆడవాళ్లను తిట్టడం తప్పు అంటూ అందరినీ కలుపుకుని మాట్లాడారు తప్ప మా అత్తని అసభ్యంగా మాట్లాడడం తప్పు ఈ సారి అలాంటిది ఏదైనా వ్యవహారం తెరమీదకు వస్తే ఊరుకునేది లేదు అంటూ ఆయన వార్నింగ్ ఇస్తాడని అందరూ భావించారు. 


కానీ  అప్పుడు టిడిపి ఆశలన్నీ వమ్మయ్యాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. సొంత తాత పేరు తీసేసి అవమానించారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించి వైసిపి ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయడం లేకపోతే, ఇది తప్పు అని ఖరాకండిగా చెప్పడం చేస్తారని టిడిపి శ్రేణులు అందరూ భావించారు. అయితే ఆయన అలాంటి మాటలు ఏమీ వాడకపోవడం ఇప్పుడు టిడిపి వారందరికీ ఒక రకంగా కోపం తెప్పించింది అని చెప్పొచ్చు.


దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీరుపైన సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు, టిడిపి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. తమ అభిమాన హీరోని ఈ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టికి రావడంతో వారంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండు సృష్టించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫుట్ నారా డాగ్స్ #JrNTRFootNaraDogs అంటే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గర నారా కుక్కలు అని ఒక హాస్టల్స్ సృష్టించి 34 వేల ట్వీట్లు చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.


జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి ఇలాంటి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోతుందని చెప్పక తప్పదని ఈ విషయంలో అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ తన అభిమానులను ఈ విషయంలో కట్టడి చేయకపోతే తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ అవుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.


మరి ఈ విషయం మీద టిడిపి నేతలు, జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట అనుకొని అధికారికంగా ఈ ట్రోలింగ్స్ కి, సోషల్ మీడియా ట్రెండింగ్స్ కి పుల్ స్టాప్ పెట్టకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో తెలుగుదేశం కానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 
Also Read: Samantha Ruth Prabhu Second Marriage: రెండో పెళ్లికి సిద్దమైన సమంత.. ప్రూఫ్ ఇదే!


Also Read: Prabhas Non Stop Shooting: కష్టకాలంలో ప్రభాస్.. పెదనాన్న మరణం మరువక ముందే మూడు నెలల పాటు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook