Tarak: ఎన్టీఆర్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఇండస్ట్రీలో తారక్ కి అభిమానులు ఎందరో. వరుస క్రేజీ హిట్స్ తో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఈ నెల విడుదల కావాల్సిన మూవీ..షూటింగ్ డిలే కావడంతో అక్టోబర్ కి వాయిదా పడింది. ఆ విషయం పక్కన పెడితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మూవీస్ కి సంబంధించింది కాదు.. అతని హాబీకి సంబంధించింది. ఈరోజు ఖైరతాబాద్ లో ఉన్న ఆర్డీవో ఆఫీస్ కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు.దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నా.


ఇంత విషయం ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి కొత్త కారు కొన్నారు. ఇదిగో ఆ కార్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఖైరతాబాద్ ఆర్డిఓ ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కారు గురించి ,దాని ఖరీదు గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆర్టీవో ఆఫీస్ కి బ్లాక్ టీ షర్ట్.. కూలింగ్ గ్లాసెస్ తో యమ స్టైలిష్ లుక్స్ తో వచ్చిన ఎన్టీఆర్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 



ఇక ఎన్టీఆర్ కొన్న కారు విషయానికి వస్తే.. మెస్సేజ్ బెంజ్ మేబెచ్ S- క్లాస్ S మోడల్ కార్ అది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ కార్ విలువ అక్షరాల 2.72 కోట్లు. కారు కాక ఎన్టీఆర్ దగ్గర ఇటువంటి లగ్జరీ కార్స్ కలెక్షన్ బాగానే ఉంది. మెర్సిడెస్ బెంజ్ GLS,లంబోర్ఘిని ఉరస్, రేంజ్ రోవర్ వోగ్, BMW 7-సిరీస్, పోర్స్చే 718 కేమాన్ మొదలైన కార్లు ఎన్టీఆర్ దగ్గర ఉన్నట్లు టాక్.


ఇక దేవర మూవీ విషయానికి వస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు.జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ కా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై సాంగ్ తో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రం మొదటి భాగం అక్టోబర్ 10న విడుదలవుతుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook