NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా   ప్యాన్ భారత్ లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2' ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా సౌత్, నార్త్ సూపర్ స్టార్స్  ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల కలయికలో తెరకెక్కుతోన్న 'వార్ 2' మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే హృతిక్ రోషన్ పై జపాన్ దేశంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.  జపాన్‌లో  ఉన్న షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఇంట్రో  సీన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ జాయిన్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ ఇప్పటికే దేవర ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఆ తర్వాత వారం రోజులు రెస్ట్ తీసుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. అది కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్   ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారు. 'వార్ 2' మూవీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. 60 రోజుల డేట్స్ కేటాయించారట. అందులో 30 రోజులు పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై సంయుక్తంగా ఈ సినిమా షూట్ చేయనున్నారట. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయట. ఇపుడున్న దానికి హాలీవుడ్ హై టెక్నాలజీతో భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మించనున్నారు. మరోవైపు ఈ సినిమా ఎక్కువ భాగాన్ని ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూట్ చేయనున్నారట. హృతిక్ తన పార్ట్‌ను జూన్ చివరి వరకు కంప్లీట్ చేయనున్నారు. ఎన్టీఆర్ తన షూటింగ్ పార్ట్‌ను జూలై నెలాఖరు వరకు పూర్తి చేయనున్నాడు.
     
ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీతో పలకరించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 10న దసరా  కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు తారక్.. ప్రశాంత్ నీల్ మూవీని ఈ యేడాది చివర్లో స్టార్ట్ చేయనున్నారు.


మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో పాటు మరో హిందీలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో ఓ సినిమా ఉండనే ఉంది. దాంతో పాటు  కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నాడు. త్వరలో వీళ్లిద్దరితో చేయబోయే సినిమాలను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. అటు హృతికో రోషన్ విషయానికొస్తే.. రీసెంట్‌గా 'ఫైటర్' మూవీతో పలకరించారు.


Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook