Devara: దేవర టైటిల్ పెట్టడానికి అసలు కారణం అదే.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Devara: ఆర్ఆర్ఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకు ‘దేవర’ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
Devara:ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘దేవర’. ఈ సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ కు మంచి క్రేజ్తో అమ్ముడైపోతున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రీ బుకింగ్స్ ద్వారా $2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మరోవైపు అభిమానులు ఈ సినిమా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేస్తే దెబ్బకు క్రాష్ అయిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకు ‘దేవర’ టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజనే ఉందని చెబుతున్నారు. ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఒకే టైటిల్ ఉండేలా ఈ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. దేవర అంటే దేవుడు అని అర్ధం అని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ సినిమా కోసం ముందుగా జాన్వీ పేరు పరిశీలించలేదని చెప్పాడు. కరణ్ జోహార్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేసాడు. స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయ్యే లోపు జాన్వీ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరింది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టాన్ని మెచ్చుకున్నాడు ఎన్టీఆర్.
అంతేకాదు ఈ సినిమాకు అనిరుథ్ అద్భుతమైన సంగీతం అందించారు. జైలర్, విక్రమ్, మాస్టర్ సినిమాలకు నేపథ్య సంగీతం కీలక భూమిక వహించింది. ‘దేవర’ సినిమాకు అనిరుథ్ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్ గా నిలవనుంది. రెహమాన్, కీరవాణి తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే రేంజ్ అనిరుథ్ కు ఉందని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ప్రీ బుకింగ్స్ లో60 వేలకు పైగా టికెట్ సేల్స్ తో భారతీయ సినిమాల్లో ఫాస్టెస్ట్ రికార్డును దేవర తన పేరున లిఖించుకుంది. అలాగే యూకే, ఆస్ట్రేలియాలో కూడా రికార్డ్ లెవల్లో ప్రీ బుకింగ్స్ తో జోరు చూపిస్తోంది. ఈ సినిమా విడుదలకు కరెక్ట్ గా వారం రోజుల మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు స్పెషల్ అనుమతులు ఇస్తారా అనేది చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను భారీ లెవల్లో తెరకెక్కించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తుంది.
ఇప్పటి వరకు దేవర నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు కొరటాల శివ కూడా ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో ఎటువంటి తరహా సినిమా చేసాడనేది ఆసక్తికరంగా మారింది. అంతకాదు కొరటాలకు దేవర తో సక్సెస్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా తేడా కొడితే.. దర్శకుడిగా కొరటాల శివ కెరీర్ ఖతమనే చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. జాన్వీకపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ నెల 22న జరగనుంది.
ఈ సినిమా విషయానికొస్తే.. సోలో హీరోగా తారక్ కు ఫస్ట్ ప్యాన్ ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం అన్ని ఏరియాల్లో థియేట్రికల్ గా మంచి బిజినెస్ చేసింది. హిందీలో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక హిందీలో ‘దేవర’ రూ. 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఓవరాల్ గా ‘దేవర’ థియేట్రికల్ గా రూ. 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ‘దేవర’ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న తెలుగు, కన్నడ, మలయాళ హిందీ,తమిళ భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.