Mokshagna Teja: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఎన్టీఆర్ సంచలన ట్వీట్..
Mokshagna Teja First Movie: ఈ రోజు నందమూరి నట సింహం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షుకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు ఈ బర్త్ డే సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మోక్షు సినీ ఎంట్రీ పై ఆయన అన్నలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సంచలన ట్వీట్ చేసారు.
Mokshagna Teja First Movie: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ రోజే ఎదురైనట్టు.. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎపుడు ఇస్తాడా అని అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. మరి ఎదురు చూపులు ఫలించాయి. ఈ రోజు మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన అప్ డేట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హ్యాండ్సమ్ లుక్ తో కెవ్వు కేక పుట్టిస్తున్నాడు. నందమూరి మూడో తరంలో మరో ఛార్మింగ్ హీరో రాబోతున్నట్టు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా వేదికగా నందమూరి మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు హీరోగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్స్ వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు నటుడిగా తాత లెగసీని కంటిన్యూ చేయాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు ఈ ప్రయాణంలో తాత ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఎల్లపుడు నీకు తోడుగా ఉంటాయని ఎన్టీఆర్ తో పాటు మరో అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేయడం విశేషం.
ఈ ట్వీట్ లో ఎక్కడా బాబాయి ఊసెత్తలేదు నందమూరి యంగ్ బ్రదర్స్ అయిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. గత కొన్నేళ్లుగా రాజకీయంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో బాలయ్యకు సరిగా పొసగడం లేదు. ఇక బాలయ్య కూడా గత కొన్నేళ్లుగా వీళిద్దరిని దూరం పెడుతూ వస్తున్నారు. అప్పట్లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో పాటు తాజాగా జరిగిన బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి వీళ్లిద్దరు హాజరు కాలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ వేరే షెడ్యూల్లో బిజీగా ఉండటంతో రాలేకపోయినట్టు బయటకు చెబుతున్నా.. స్వయంగా బాబాయితో విభేదాల కారణంగా ఈ కార్యక్రమాలకు రావాలని ఉన్నా.. రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా తమ్ముడి పుట్టినరోజున మోక్షుకు బర్త్ డే విషెస్ తెలియజేసి అన్నయ్యలుగా తమ బాధ్యతలను నెరవేర్చారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.