Jr NTR Mahesh Babu And Allu Arjun మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మార్మోగిపోతోంది. కాసేపటి క్రితమే శంకర్ రామ్ చరణ్‌ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. గేమ్ చేంజర్ అంటూ వదిలిన లోగో, గ్లింప్స్ నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ మీద కూడా టాలీవుడ్ స్పందిస్తోంది. కానీ అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్‌ బాబు వంటి వారు ఇంకా రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ చెప్పలేదు. సోషల్ మీడియాలో ఎక్కడా కూడా పోస్ట్ వేయలేదు. కనీసం వారి వారి ఎఫ్‌బీ, ఇన్ స్టా స్టోరీల్లోనూ ఎక్కడా స్పందించినట్టు కనిపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్‌కు మెగా క్యాంప్‌కు గ్యాప్ ఉందని ఎప్పటినుంచో రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక నిన్నటి ఈవెంట్‌లో నాగబాబు సైతం ఎక్కడా బన్నీ పేరుని ప్రస్థావించలేదు. బన్నీ సైతం మరీ తప్పదనుకుంటే.. తప్పా.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడటం లేదనిపిస్తోంది. మొన్నటి నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం దానిపై ఆలస్యంగా స్పందించడం తెలిసిందే. ఆ స్పందనలో రామ్ చరణ్‌ను బ్రదర్ అని, ఎన్టీఆర్‌ని తెలుగు ప్రైడ్ అని అనడంతో రచ్చ రచ్చగా మారింది.


ఇక ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్‌తో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడని, అందుకే ఆస్కార్ వేదిక మీద అవకాశం వచ్చినా కూడా ఎన్టీఆర్ మాత్రం నో చెప్పాడట. రామ్ చరణ్‌తో కలిసి మళ్లీ డ్యాన్స్ చేయడం ఇష్టం లేకనే వద్దన్నాడట. కానీ రిహార్సల్స్‌కు టైం లేదని చెప్పి తప్పించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలా ఎన్టీఆర్ రామ్ చరణ్‌ మధ్య గ్యాప్ ఉందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.


మహేష్‌ బాబు రామ్ చరణ్‌ మధ్య మంచి స్నేహం ఉంది. కానీ రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఇంకా మహేష్‌ బాబు ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. అయితే ఈ హీరోలు బిజీగా ఉండటం వల్ల ట్వీట్లు వేయలేదా? లేదంటే పర్సనల్‌గా మెసెజ్‌లు పంపించారా? లేదంటే ఇంకా టైం ఉంది కాబట్టి రాత్రి వరకు ట్వీట్లు వేస్తారా? అన్నది చూడాలి. సమంత, రష్మిక వంటి టాప్ హీరోయిన్లు అయితే రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు.


తాజాగా సింగిల్‌ లైన్‌లో రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ మహేష్‌ బాబులు విషెస్ అందించారు. బ్రదర్ అంటూ తారక్, రామ్ చరణ్ అంటూ మహేష్‌ బాబు ట్వీట్లు వేశారు. ఇక బన్నీ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.


Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్


Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook