Jr NTR No 1 & Ram Charan No 2 as Top Male mentions at Oscars: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ ముందు నుంచే లభించింది. అయితే ఆస్కార్ అవార్డు లభిస్తుందని ఎవరు ఊహించలేదు. అనూహ్యంగా ఆస్కార్‌లో నామినేట్ అయినప్పటి నుంచి ఈ సాంగ్‌కు ఆస్కార్ లభిస్తుందేమోనని ఆశలు చిగురించాయి. ఎట్టకేలకు ఆస్కార్ అవార్డుల వేదిక మీద నాటు నాటు సాంగ్‌కే ఆస్కార్ అవార్డు లభించడం హాట్ టాపిక్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఎక్కువగా ప్రస్తావించిన పేరు జూనియర్ ఎన్టీఆర్‌దని తేలింది. నెట్ బేస్ క్విడ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో ఆస్కార్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈవెంట్‌లో ఎక్కువగా ఎన్టీఆర్ పేరుని మెన్షన్ చేశారని... ఆ తరువాత రామ్ చరణ్ పేరును మెన్షన్ చేశారని తెలిసింది. 


ఇక ఆ తర్వాత మిగతా హీరోలు అందరూ వచ్చారు. హాలీవుడ్ నటీనటులందరినీ దాటుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదటి రెండు స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. ఇక లేడీస్ విషయానికి వస్తే మొదటి ఐదు స్థానాల్లో దీపిక పదుకొణె ప్లేస్ దక్కించుకోలేకపోయింది. ఇక టాప్ మూవీ మెన్షన్స్ విషయానికి వస్తే...  ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానం దక్కించుకోగా... రెండో స్థానంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిలిచింది. 


ఆ తర్వాత స్థానంలో ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్ సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్ ఫ్రెండ్... అలాగే అర్జెంటీనా 1985 సినిమాలు నిలిచాయి. ఆస్కార్ వేదిక మీద అవార్డులు వేడుక జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ మావాడు తోపురా అంటూ... సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.


Also Read: Dasara Trailer Launch: నాని 'దసరా' ట్రైలర్ వచ్చేసింది.. 5 నిమిషాల్లోనే 20 వేల వ్యూస్! ఆలస్యం ఎందుకు


Also Read: ‘The Elephant Whisperers’ on OTT: ఆస్కార్ గెలిచిన ఎలిఫెంట్ విస్పరర్స్ ఏ ఓటీటీలో చూడాలో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook