Jr NTR Family in Vacation స్టార్ హీరోలంతా కూడా ప్రస్తుతం సెట్స్ మీదున్నారు. పవన్ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, రామ్ చరణ్‌, ప్రభాస్ ఇలా అందరూ కూడా సినిమా పనులతో బిజీగా ఉన్నారు. మహేష్‌ బాబు అయితే త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ జరిగిన షూటింగ్‌ను క్యాన్సిల్ కూడా చేశారు. మళ్లీ కొత్త కథను రాశాడట త్రివిక్రమ్. ఆ పనుల్లో మహేష్‌ బాబు బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ అయితే పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే పుష్ప ది రూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్‌ అయితే శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత బుచ్చిబాబుతో మరో సినిమాను కూడా చేయబోతోన్నట్టు ప్రకటించాడు. అందరూ ఇలా నెక్ట్స్ సినిమాల మీద ఎంతో క్లారిటీతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అదే చేశాడు. కానీ కొరటాల శివకు ఆచార్య రూపంలో పెద్ద దెబ్బ పడటంతో అంతా తారుమారైంది. దీంతో కొరటాల శివ తన కథపై మరింతగా దృష్టి పెట్టాడు.


ఎన్టీఆర్ సైతం స్క్రిప్ట్ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడట. అందుకే ఈ సినిమా కథ ఇంకా పూర్తి కాలేదు.. స్క్రిప్ట్ వర్క్ జరగడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ కొన్ని యాడ్స్ కూడా చేశాడు. అలా బాగానే సంపాదించేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌కు కొరటాల పూర్తి కథను చెప్పాడని, అది బాగా నచ్చడంతో.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయమని చెప్పినట్టు తెలుస్తోంది.


స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయిందని సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలో పూర్తి చేసేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈలోపు అమెరికాలొ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసి వద్దామని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. అందుకే నిన్న ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లాడు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి.


Also Read : Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ మంజుల ఘట్టమనేని పోస్ట్.. అదే చివరిది అవుతుందని అనుకోలేదట


Also Read : TV Artist Sreevani : కొత్తింట్లోకి నటి శ్రీవాణి.. బుల్లితెర తారల సందడి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook