Jr NTR about Devara: అభిమానుల ఆలోచనలకు తగ్గట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో  భాగంగానే తాజాగా ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అందులో భాగంగానే మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఇటీవల సినిమా నుంచి విడుదలైన పాటలు,  టీజర్,  పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.  అందులో భాగంగానే దేవర చిత్రాన్ని  గోవాలో చాలావరకు చిత్రీకరించారు. సినిమా షూటింగ్లో భాగంగా గోవా తీరాన  సముద్రంలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు ఒక్కసారిగా తాను చచ్చిపోతానని భయం వేసిందని,  ఆ సమయంలో భార్యా పిల్లలు గుర్తుకొచ్చారంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు ఎన్టీఆర్. 


ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సముద్రంలో ఒక సన్నివేశం చిత్రీకరించడానికి గోవా వెళ్ళాము. గోవాలో ఆ సీన్ చేసేటప్పుడు సముద్రంలోకి నేను వెళ్ళగా.. సూర్యుడు ఆ సమయంలో నిప్పులు కురిపిస్తున్నాడు. ఆ వేడి తాకిడికి తట్టుకోలేకపోయాను. ఒక్క క్షణం చచ్చిపోతానేమో అనిపించింది. భార్య పిల్లలు కూడా ఆ సమయంలో గుర్తుకొచ్చారు. షార్ట్ ఓకే అవగానే లుంగీ అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఏసి రూమ్ లో ఉన్న బెడ్ పై అలా పడుకున్నాను.  వెంటనే కరెంటు పోయింది.  ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ బాధపడ్డారు ఎన్టీఆర్.


ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ కు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. అంతేకాదు రక్త శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. అంలాగే పలు ప్రాంతాలలో ఎన్టీఆర్ సినిమా హిట్ కావాలని పూజలు కూడా నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.


Also Read:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


Also Read: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.