NTR Shoes Cost: సెలబ్రిటీలు ఎంత లగ్జరీగా జీవిస్తారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒక్కొక్కసారి వారు ధరించే దుస్తులైనా, వస్తువులైనా ఏదైనా సరే అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు తన దుస్తులతో,  యాక్ససరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే వారిలో ప్రముఖ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి,  తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు వరుస పెట్టి చిత్రాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్న ఎన్టీఆర్,  ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు ఈరోజు చాలా ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో నిర్వహించబోతున్నారు. 


ఇక అందులో భాగంగానే నిన్న ముంబై వెళ్ళిన ఈయన, అక్కడ బాలీవుడ్ నటులను కలుస్తూ మీడియాకి ఫోజులిస్తూ హడావిడి చేస్తూ..  దేవర  సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఎన్టీఆర్ కలిసిన ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. 


ఈ ఫోటోలో ఎన్టీఆర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకున్నాడు. Balenciaga  అనే కంపెనీ షూ ధరించాడు.  దీంతో ఈ షూ ధర ఎంత ఉంటాయో అని నెటిజన్స్ అభిమానులు గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. వీటి ధర ఆల్మోస్ట్ రూ.40 వేలకు పైగా ఉంటుంది. ఈ బ్రాండ్ లో ఇది స్టార్టింగ్ ప్రైజ్ మాత్రమే. ఈ బ్రాండ్ లో లక్ష రూపాయల పైన ఉన్న షూ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వేసుకున్న ఈ షూ ధర అక్షరాల 80 వేల రూపాయల పై మాటే.


ఈ షూస్ ధర తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే మన సెలబ్రిటీల దగ్గర ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ చాలానే ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర రూ.లక్షల్లోనే కాదు రూ .కోట్లలో విలువ చేసే వాచ్ లు కూడా ఉన్నాయి. ఇక ఆయన లగ్జరీ లైఫ్ ముందు వీటి ధర చాలా తక్కువే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: AP Debts: మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అప్పులు అర లక్ష కోట్లు.. బాబు పాలనలో భారీగా అప్పులు


Also Read: Munneru Swimmng: మద్యంమత్తులో మున్నేరు నదిలో దూకిన యువకులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter