Recce At Pawan Kalyan House : పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ.. అసలు విషయం చెప్పిన పోలీసులు
Police Reacts on Pawan Kalyan Home Recce Issue పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందనే వార్తలు ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి. వీటిపై పోలీసులు స్పందించారు. అది రెక్కీ కాదని తేల్చి చెప్పారు.
Pawan Kalyan Home Recce Issue : పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించారు.. ఆయన్ను చంపేందుకు పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చారు.. హత్యకు కుట్ర చేశారంటూ నేటి ఉదయం నుంచి వార్తలు ఒక్కసారిగా వైరల్ కాసాగాయి. అయితే వీటిపై పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. తాజాగా ఈ విషయం మీద పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీపై హైద్రాబాద్ పోలీసులు అసలు విషయాన్ని చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కీ జరగలేదని పోలీసులు తేల్చి చెప్పేశారు. అదంతా తాగుబోతులు చేసిన రగడ అని పేర్కొన్నారు. ముగ్గురు యువకులు ఫుల్లుగా తాగి అనుకోకుండా, యాదృశ్చికంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కారు ఆపారు. కారు అక్కడి నుంచి తీసేయాలని పవన్ సెక్యూరిటీ కోరడంతో గొడవ మొదలైంది. తాగి ఉన్న ఆ ఆకతాయిలు.. సెక్యూరిటీతో గొడవకు దిగారట. ఆ యువకులను వినోద్, ఆదిత్య, సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు. ఆ యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో రెక్కీ రూమర్లు ఇంతటితో ఆగిపోయాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక రేపు మాత్రం గుంటూరులో జన సేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జన సైనికులు పవన్ కళ్యాణ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పర్చాలని భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీ అంశం మీద రామ్ చరణ్ స్పందించాడని, భారీ భద్రత కల్పించాలని రామ్ చరణ్ కూడా భావించినట్టుగా వార్తలు వచ్చాయి.
Also Read : Samantha Yashoda : ఆ విషయాలేవీ సమంత చెప్పలేదు.. ఎంతో బాధగా అనిపించింది.. ఉన్ని ముకుందన్ కామెంట్స్ వైరల్
Also Read : Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ దూకుడు.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook