KA Paul Demands CBI Enquiry on Tarakaratna Death: నందమూరి కుటుంబానికి చెందిన తారకరత్న నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రారంభం రోజున గుండెపోటుకు గురై కుప్పకూలిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయనకు ముందుగా కుప్పంలో వైద్య సదుపాయాలు అందించినా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యాలయానికి తరలించి అక్కడే చాలా రోజులు పాటు వైద్యం అందించారు. అయితే ఎంత అధునాతన వైద్యం అందించినా తారకరత్న కోలుకోకపోవడంతో ఫిబ్రవరిలో తారకరత్న కన్నుమూశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తారకరత్న ఎప్పుడో చనిపోయినా నారా లోకేష్ పాదయాత్ర మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఆయనను చాలా కాలం పాటు హాస్పటల్లోనే ఉంచారని వైసీపీ శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద నందమూరి లక్ష్మీపార్వతి సైతం అనేక ఆరోపణలు గుప్పించారు. అయితే తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం వద్దకు వెళ్లి ప్రార్థనలు కూడా చేసి వచ్చిన కేఏ పాల్ ఇప్పుడు తారకరత్న మృతి గురించి సిబిఐ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Sharwanand Marriage: ఎంగేజ్మెంట్ అయిన నాలుగు నెలలకు కూడా శర్వానంద్ పెళ్లి ఎందుకు అవ్వలేదు?


తారకరత్న మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన తాజాగా మీడియాతో మాట్లాడిన అంశం కలకలం రేపుతోంది. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకుగాను కేఏ పాల్ ఇప్పుడు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. ఆ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కేఏ పాల్ ఈ మేరకు కామెంట్లు చేశారు. బాబు రావాలి జాబు రావాలి అంటున్నారు కానీ బాబు వస్తే శని అని కేఏ పాల్ అన్నారు.


ఆ బాబు మీటింగ్ కి వెళ్లకపోతే తారకరత్న బతికే ఉండేవాడని ఈ సందర్భంగా పేర్కొన్న కేఏ పాల్ తాను నిజం చెబుతున్నానని తారకరత్న మృతి చెందిన సమయంలో రాజకీయం చేయకూడదు కాబట్టి ఏడుస్తూ ప్రార్థన చేసి వచ్చానని అన్నారు. తారకరత్న ఎప్పుడు చనిపోయాడో సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన కేఏ పాల్ చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్ లో పెట్టారు? కనీసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంక్వైరీ అయినా చేయాలని డిమాండ్ చేశారు.


చిత్తశుద్ధి ఉంటే ఈ ఎంక్వయిరీ చేయించాలని అప్పుడే నిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. తాను పర్సనల్ క్రిటిసిజం చేయడం లేదని పేర్కొన్న ఆయన ఒక్కొక్కరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనే విషయం తన ప్రశ్నించడం లేదని ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు అనే విషయాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని ఈ సందర్భంగా కేఏ పాల్ కామెంట్ చేశారు.


Also Read: Chiranjeevi vs Rajini: చిరుని ఢీ కొట్టనున్న రజనీకాంత్..మరో రెండు సినిమాలు కూడా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook