Kabzaa Movie Teaser Raising Expectations: ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమ మార్కెట్ చాలా చిన్నగా ఉండేది. కన్నడ సినీ పరిశ్రమ నుంచి సినిమా ఇతర భాషల్లోకి డబ్బింగ్ జరగడం అనేది కూడా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉండేవి. ఉపేంద్ర వంటి హీరోల సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యేవి కానీ పెద్దగా మార్కెట్ అయ్యేవి కాదు. అయితే ఎప్పుడైతే కేజిఎఫ్ లాంటి సినిమా పాన్  ఇండియా లెవెల్ లో విడుదలయి సూపర్ హిట్ గా నిలిచిందో అప్పటినుంచి కన్నడ సినిమాలు ఇతర భాషల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపద్యంలో చార్లీ, అతడే శ్రీమన్నారాయణ వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయ్యాయి. ఆ సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన మేకర్స్ కూడా తమ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆ లెవల్లో విడుదల చేయాలంటే అదే స్థాయిలో సినిమాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.


ఈ నేపథ్యంలోనే తాజాగా ఉపేంద్ర హీరోగా కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించిన కబ్జా సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం కూడా ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ కూడా కేజిఎఫ్ సినిమాను తలపిస్తూ సాగింది. 1942 వ సంవత్సరంలో ఒక గ్యాంగ్ స్టార్ జీవిత ప్రయాణాన్ని గురించి సినిమా ఉండబోతుందని టీజర్ లో హింట్ ఇచ్చారు.


కానీ ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేమ్ కేజీఎఫ్ స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారా అనే విధంగా సాగుతుంది. కేజీఎఫ్ లో చూపించిన తల్లి సీన్ కూడా ఇందులో చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సుదీప్ ఎంట్రీ ఉపేంద్ర ఎంట్రీ అలాగే శ్రియ శరణ్ ఎంట్రీ కూడా సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా సాగింది. మరి ఆ టీజర్ మీద మీరు కూడా చూసేయండి మరి. 


Also Read: Varun Tej as Abhinandan Varthaman: అభినందన్ పాత్రలో వరుణ్ తేజ్.. పాన్ ఇండియా లెవల్లో మూవీ!


Also Read: Sampoornesh Babu offer: గాజువాక కండక్టర్ కు సంపూ బంపర్ ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి