Kajal Aggarwal honeymoon plans: నవ దంప‌తులు కాజ‌ల్ అగ‌ర్వాల్, గౌత‌మ్ కిచ్లు త‌మ హ‌నీమూన్ సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ని కాజ‌ల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాజల్ పెళ్లి తరువాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకొని ఆచార్య షూటింగ్‌‌కి హాజరైన తరువాతే హానీమూన్‌కి వెళ్తుంద‌ని గతంలో వార్తలొచ్చాయ్. కానీ, తాము హ‌నీమూన్ వెళ్తున్నామంటూ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికి ట్విస్ట్ ఇచ్చింది కాజల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ( Kajal Aggarwal And Gautam Kitchlu ) పేర్ల‌తో ఉన్న పౌచ్‌ల‌తో పాటు వారిద్దరి పాస్ పోర్ట్‌ల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది కాజ‌ల్. అంతేకాకుండా ''బ్యాగ్స్ ఆర్ ప్యాక్డ్.. రెడీ టూ గో..'' అనే క్యాప్షన్‌ను కూడా జతచేసింది. దీంతో వీరికి నెటిజన్స్ హ్యాపీ జర్నీ అనే కామెంట్స్ పెడుతున్నారు. అయితే, కాజల్ వారి హనీమూన్ డెస్టినేషన్‌ని ( Kajal Aggarwal honeymoon destination ) మాత్రం సీక్రెట్‌గా ఉంచింది.


Also read : Samantha hosting Sam Jam: 'సామ్ జామ్' అంటున్న సమంత


కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అక్టోబర్ 30న ముంబైలోని ప్రముఖ హొటల్‌లో సమీప బందువుల సమక్షంలో ఒకటయ్యారు. కాజల్, కిచ్లు ఏడు సంవత్సరాల స్నేహం, మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు. పెళ్ళి త‌ర్వాత ప్ర‌తి రోజు ఫొటో షూట్ చేస్తున్న కాజ‌ల్ అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్ చేస్తోంది.


Also read : Bigg Boss Telugu 4: ఎలిమినేషన్ ప్రమాదంలో ఎవరున్నారు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe