Kalatapasvi K Viswanath Uniform తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ (92) కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాఢపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను విన్న టాలీవుడ్ ఒక్కసారి దిగ్భ్రాంతిని లోనైంది. ఆయన మరణం పట్ల తెలుగు సినీ లోకం, రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన తెరకెక్కించిన చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. ఆయన కెరీర్‌లో 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమా ఆత్మగౌరవం. అది 1965వ సంవత్సరంలో వచ్చింది. ఆయన తీసిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే.


ఆయన సినిమాలు తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా ఉంటాయి. ఆయన తీసే సినిమాలు, మన సంప్రదాయాన్ని చాటి చెప్పే తీరుని చూసి 1992లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయన సినీ రంగానికి చేసిన విశేష సేవలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది.


ఇక ఆయన గురించి ఓ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన తన సినిమా షూటింగ్‌లు జరుగుతుంటే.. ఒకే లుక్కులో కనిపించేవారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్స్ మీద ఖాకీ బట్టలతో యూనిఫాం ధరించి కనిపిస్తుంటారు. పాత సినిమాలకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది కనిపిస్తుంది.


అలా ఎందుకు ధరిస్తారు? అని విశ్వనాథ్‌ను అడిగితే ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పేవారు. దర్శకత్వం అనేది ఓ బాధ్యత, ఓ విధి, ఓ ఉద్యోగం లాంటిది.. అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశ్యంతోనే అలా యూనిఫాంలో కనిపిస్తాను అని అనేవారు. అలా ఆయన డెడికేషన్ చూపించే వారు కాబట్టే.. తీసిన సినిమాలన్నీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయాయి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి ఇలా ఎన్నెన్నో సినిమాలు ఆయన మస్తిష్కంలో పుట్టినవే.


Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే


Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook