Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ ఎపుడు ప్రారంభం అయింది.. మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందంటే..!
Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ ఎపుడు ప్రారంభం అయింది.. మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది. మొత్తంగా ఈ సినిమా ప్రయాణం ఎలా సాగిందంటే..
Kalki 2898 AD Movie Review: ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీని 2020 ఫిబ్రవరిలో మొదటిసారి అనౌన్స్ చేశారు. మొదట ఈ సినిమాకు ప్రాజెక్ట్ K అనే టైటిల్ అనౌన్స్ చేశారు. కరోనా కారణంగా ఒక యేడాది ఆలస్యం గా జూలై 2021లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఫ్యూచరిస్టిక్ సెట్‌లో ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది.
2021 జూలై నుంచి మార్చి 2024 వరకు కల్కి షూట్ జరిగింది. మే9 2024 న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ 2024 భారత సాధారణ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇపుడు జూన్ 27 న రిలీజ్ అవుతోంది
ఈ సినిమాను మహాభారత కాలం నుంచి 2898 AD వరకు ఆరు వేల ప్రయాణాన్ని వివరిస్తు సాగే కథ కల్కి మూవీని తెరకెక్కించారు. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఫస్ట్ భారతీయ సినిమా ‘కల్కి 2898 AD’. ఒక్క ఏడాది గ్యాప్ లో ప్రభాస్ 3 సినిమాలు రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషం.
గతేడాది వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ రూ. 120 కోట్ల బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఇయర్ ఎండ్ లో వచ్చిన సలార్ రూ. 145 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న ప్రభాస్ కల్కి రూ. 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఏడాది గ్యాప్ లో ప్రభాస్ నటించిన 3 సినిమాల తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 435కోట్లు. మొత్తంగా ప్రభాస్ కెరీర్ లో తొలి టైమ్ మిషన్ సైన్స్ ఫిక్షన్ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఇదే కావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి