Kalki 2898 AD Collections: ఓవర్సీస్ లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ మరో రేర్ ఫీట్.. రెబల్ స్టార్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. గత కొన్నేళ్లుగా డల్ గా ఉన్న తెలుగు బాక్సాఫీస్ కు బిగ్ సేవియర్ గా మారాడు. లాస్ట్ ఇయర్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ మూవీలతో బాక్సాఫీస్ ను రఫ్పాడించాడు డార్లింగ్. తాజాగా ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ లోనే మరో రేర్ ఫీట్ సాధించాడు.
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ప్రస్తుతం ఓ పేరు కాదు..బాక్సాఫీస్ సేవియర్ అని చెప్పాలి. మొత్తంగా కల్కి మూవీతో తెలుగు సహా భారత దేశ వ్యాప్తంగా తన బాక్సాఫీస్ ను కళకళ లాడేలా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ ఆదివారం మంచి గ్రోత్ చూపించినట్టు పలు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆఫ్ లైన్ టికెట్స్ జోరు చూపిస్తే.. 4వ రోజు ప్రభాస్ ‘కల్కి’ మూవీ రూ. 50 కోట్ల షేర్ నుంచి రూ. 60 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫస్ట్ డే తర్వాత బెస్ట్ డే గా ఆదివారం నిలవనుంది. ఇక హిందీ బెల్ట్ లో ఈ సినిమా నిన్న దాదాపు రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. నిన్నటితో అక్కడ రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కనుంది.
మొత్తంగా ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే బాక్సాఫీస్ షేక్ కావడం అనేది ‘కల్కి 2898 AD’ మూవీతో ప్రూవ్ అయింది. మొత్తంగా 4 రోజుల్లో ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మరోవైపు హిందీలో ప్రస్తుతం కల్కి ఊపును ఆపడం ఎవరి తరం కాదు. అక్కడ ఈ సినిమా ప్రేక్షకుల్లో వెళ్లిపోయింది. మరోవైపు ఈ సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ తో పాటు నాగ్ అశ్విన్ పేరు మారు మోగిపోతుంది.
ఇక ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా దాదాపు $ 13 మిలియన్స్ రాబట్టినట్టు సమాచారం. ఒక్క నార్త్ అమెరికాలోనే $ 11 మిలియన్ క్రాస్ చేసి సంచలనం రేపింది. మొత్తంగా అమెరికన్ మార్కెట్ లో ఈ సినిమా ముందు ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్కిన్ సుప్రీమ్ పాత్రలో కమల్ హాసన్ నటించారు. అటు అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించాడు. అటు దుల్కర్ సల్మాన్ పాత్ర పరుశురాముడిని పోలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ ఈ సినిమాలో బైరవతో పాటు కర్ణుడిగా నటించారు.
Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter.