Vijay Deverakonda Response to Fan: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ.. చేస్తున్న ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడం లేదు. ఖుషి సినిమాతో.. పర్వాలేదు అనిపించినప్పటికీ.. విజయ్ దేవరకొండ ఈ మధ్యన నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్.. అయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. 


అయితే సోషల్ మీడియాలో.. మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ.. తన అభిమానులకు కూడా అప్పుడప్పుడు.. రిప్లై ఇస్తూ కనిపిస్తాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న పాప.. వీడియోకి రిప్లై ఇస్తూ విజయ్ దేవరకొండ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయిన ఈ వీడియోలో.. ఆర్య అనే ఒక చిన్న పాప తన తండ్రిని విజయ్ దేవరకొండ ఎందుకు మైక్ ని డిఫరెంట్ గా పట్టుకుంటాడు అని అడుగుతుంది. 


దానికి తన తండ్రి తెలియదు అని సమాధానం చెప్పగా.. ఆ పాప విజయ్ దేవరకొండకి బిర్యానీ అంటే ఇష్టం అనుకుంటా అని అంటుంది. దానికి ఆమె తండ్రి ఎందుకు.. అని అడగగా ఆ పాప బిర్యాని లెగ్ పీస్ కూడా ఇలానే పట్టుకొని తింటాం కదా అని జవాబిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్న పాప తెలివితేటలకి అందరూ నవ్వుకున్నారు. 


 



ఈ వీడియో ఇప్పుడు విజయ్ దేవరకొండ కంట కూడా పడింది దీంతో ఆ పాపకి విజయ్ దేవరకొండ స్వయంగా రిప్లై ఇచ్చాడు. "అవును ఆర్య నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను ఎందుకు మైక్ అలా పెట్టుకుంటానో.. నాకు కూడా తెలియదు. మే బి నాకు అడ్డం రాకుండా.. కంఫర్టబుల్ గా ఉంటుంది అని అనుకుంటా" అంటూ జవాబు ఇచ్చాడు విజయ్ దేవరకొండ. 


విజయ్ దేవరకొండ క్యూట్ రిప్లై కి అభిమానులు కూడా ఇంప్రెస్ అయ్యారు. చిన్న పాప కోసం.. విజయ్ దేవరకొండ రిప్లై ఇవ్వడం బాగుంది అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. 


ఇక సినిమాల పరంగా చూస్తే విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ప్రభాస్ కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించారు. కల్కి సీక్వెల్ లో.. కూడా విజయ్ దేవరకొండ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నానురి దర్శకత్వంలో.. ఒక సినిమా చేస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలనం.. 9 నెలల యువతి కేసు 9 రోజుల్లో పరిష్కారం


Also Read: C Naga Rani IAS: వెస్ట్‌ గోదావరికి పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే అందరికీ హడలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి