Kalpika Ganesh Controversy: వివాదాలతో సావాసం.. పిలవని పేరంటానికి వెళ్లి హాట్ టాపిక్!
Kalpika Ganesh Became Hot Topic again: నటి కల్పిక గణేష్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది, తాజాగా ఆమె సంతోషం ఈవెంట్లో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆ వివరాలు
Kalpika Became Hot Topic again: నటిగా కంటే వివాదాస్పద వ్యవహారాలతో ఎక్కువగా ఫేమస్ అవుతుంది కల్పికా గణేష్. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాల్లో కనిపించని ఈ భామ ఇటీవల సమంత ప్రధాన పాత్రలో రూపొందిన యశోద అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఏ ముహూర్తాన యశోద సినిమాలో నటించినదో తెలియదు కానీ అప్పటి నుంచి వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.
ముందుగా అభినవ్ గోమతం అనే కమెడియన్ ను ఒక వివాదంలోకి లాగి ఆయన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కల్పికా గణేష్ ఆ తరువాత యశోద ప్రమోషన్స్ లో తమ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అంటూ షీ టీమ్స్ కు కంప్లైంట్ చేసి మరో వివాదానికి కారణమైంది. ఆ సమయంలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తమకు కామెంట్లు పెట్టిన వారందరినీ బూతులతో విరుచుకుపడిన ఈ భామ తర్వాత ధన్య బాలకృష్ణన్ అనే మరో హీరోయిన్ ని కూడా టార్గెట్ చేసింది.
ఆమె బాలాజీ అనే ఒక తమిళ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేస్తుందని కామెంట్లు చేసిన ఈ భామ ఆమెతో కూడా ఒక వివాదం ఏర్పడేలా చేసుకుంది. అవన్నీ సద్దమణుగుతున్నాయి అనుకున్న సమయంలో సంతోషం ఓటీటీ అవార్డుల వేడుకకు హాజరై మరోసారి షాక్ ఇచ్చింది. సుమారు 25 ఏళ్లుగా సంతోషం మ్యాగజైన్ తెలుగు సినీ ప్రేమికులను అలరిస్తూ వస్తుంది. ఈ ఏడాది సంతోషం ఒకటవ ఓటీటీ అవార్డులు వేడుక నిన్న ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కల్పికను ఆహ్వానించలేదట, అయినా సరే ఆ కార్యక్రమంలో ఆమె మెరవడంతో యాంకర్ గా వ్యవహరిస్తున్న హరితేజ ఆమెను స్టేజ్ మీదకు ఆహ్వానించారు. స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత తనను పిలవలేదంటూ స్టేజి మీదే కామెంట్ చేసి ఇదంతా మన ఫ్యామిలీ ఏ కాబట్టి పిలవకపోయినా వచ్చేసాను అంటూ ఆవిడ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అవి ఓటీటీ అవార్డులు కావడంతో కేవలం ఓటీటీలో అవార్డులు సాధించిన వారిని మాత్రమే ఆహ్వానించారు నిర్వాహకులు.
పిలవని పేరంటానికి వెళ్లడమే కాక తనను ఎందుకు పిలవలేదంటూ అక్కడ నిర్వాహకులను ప్రశ్నించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే కార్యక్రమాన్ని ముందుకు సాగనిచ్చేందుకు అందరూ సైలెంట్ గా ఉండిపోవడంతో అక్కడితో వివాదం సమసిపోయింది. కానీ కల్పిక వ్యవహారం మాత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.